Begin typing your search above and press return to search.
ఆ వ్యాఖ్యతో కంగనా ఇప్పుడు ఒంటరి
By: Tupaki Desk | 5 Sep 2020 4:30 AM GMTమొన్నటి వరకు కంగనా ఏం మాట్లాడిన చాలా మంది ఆమెకు మద్దతుగా నిలిచేవారు. ముఖ్యంగా ఆమె చేసిన కాస్టింగ్ కౌచ్.. మీటూ మరియు నెపొటిజం వ్యాఖ్యలను కోట్లాది మంది సమర్థించారు. అయితే ఆమె తాజాగా చేసిన ఒక్క వ్యాఖ్యతో ఆమెను ఆ కోట్లాది మంది ఒంటరి చేశారు. ముంబయిని పీఓకే తో పోల్చుతూ ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల ముంబయి వాసులు మాత్రమే కాకుండా అంతా కూడా ఆమెను టార్గెట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడుతూ వచ్చిన వారు ఆమెపై ఎదురు దాడికి దిగుతున్నారు.
కంగనా ఈమద్య కాలంలో శివ సేన పార్టీ యువ నాయకుడిపై కూడా వ్యాఖ్యలు చేయడంతో అది రాజకీయంగా కలిసి వస్తుందేమో అనే ఉద్దేశ్యంతో కొన్ని పార్టీలు కూడా ఆమెకు మద్దతుగా మాట్లాడుతూ వచ్చాయి. ఆమె ప్రాణాలకు హాని ఉందని వెంటనే ఆమెకు సెక్యూరిటీ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా విషయంలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీ విమర్శలు గుప్పించింది. కాని ఇప్పుడు కంగనా ముంబాయి పీఓకే వ్యాఖ్యలతో ఆ పార్టీ కూడా ఆమెకు దూరం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఆ పార్టీ వారు అధికారికంగానే ఆమెతో మాకు ఎలాంటి సంబంధం లేదు ఆమె వ్యాఖ్యలు సరైనవి కాదు. ఆమె వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నాం అంటూ ప్రకటించారు. ఇప్పుడు కంగనాకు మద్దతుగా మాట్లాడిన వారు అంతా కూడా ఆమె వ్యాఖ్యలను సమర్థించినట్లే అవుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. దాంతో ఆమె విషయంలో అంతా మౌనంగా ఉంటున్నారు. ఈనెల 9న ఆమె ముంబయిలో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె శివసేనకు నేను వస్తున్నాను ఎవడు ఆపుతాడో నేను చూస్తాను అంటూ ఛాలెంజ్ చేసిన విషయం తెల్సిందే.