Begin typing your search above and press return to search.
మాస్క్ ధరించని కంగనా.. అరెస్ట్ చేయాలని నెటిజన్స్ డిమాండ్..!
By: Tupaki Desk | 9 Jun 2021 12:30 PM GMTబాలీవుడ్ హీరోయిన్ క్వీన్ కంగనా రనౌత్ ఈ మధ్య ఏది చేసినా వివాదాస్పదం అవుతోంది. ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న కంగనా.. తాజాగా మాస్క్ లేకుండా తిరుగుతూ సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోల్స్ ఎదుర్కొంటోంది. మంగళవారం ముంబైకి తిరిగి వచ్చిన కంగనా.. మహారాష్ట్ర ప్రభుత్వం పాక్షికంగా కూల్చివేసిన తన ఆఫీస్ ను సందర్శించింది. అయితే కార్యాలయం పునర్నిర్మాణం గురించి చర్చించడానికి తన టీమ్ తో కలిసి వచ్చిన కంగనా మాస్క్ లేకుండా కనిపించింది.
కంగనా తన ఆఫీస్ కు వచ్చిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఇందులో తన టీమ్ మెంబర్స్ అందరూ మాస్కులు పెట్టుకొని ఉంటే.. కంగనా మాత్రం మాస్క్ లేకుండా ఉంది. దీంతో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిందని నెటిజన్స్ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. 'మాస్క్ లేకుండా తిరుగుతున్నందుకు ఆమెను అరెస్ట్ చేయాలి' అని ఒకతను డిమాండ్ చేసాడు. 'సన్ గ్లాసెస్ పెట్టుకోవడం గుర్తుంది కానీ మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయిందా?' అని మరో నెటిజన్ ప్రశ్నించారు.
కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా కంగనా రనౌత్ ఎటువంటి పాఠం నేర్చుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు. కేవలం 2 సెకన్ల పాటు మాస్క్ ధరించనందుకు తనకి ఫైన్ వేశారని.. కానీ కంగనా మాస్క్ లేకుండా పబ్లిక్ గా కనిపించినప్పటికీ జరిమానా విధించలేదని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. కోవిడ్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు కంగనా పై సరైన చర్యలు తీసుకోవాలని కొందరు నెటిజన్స్ బిఎంసి మరియు సిఎం ఉద్ధవ్ థాకరే లను సోషల్ మీడియాలో ట్యాగ్ చేశారు.