Begin typing your search above and press return to search.

జనాలు మామూలుగా తిట్టట్లేదుగా..

By:  Tupaki Desk   |   11 July 2017 4:43 AM GMT
జనాలు మామూలుగా తిట్టట్లేదుగా..
X
బాలీవుడ్ లో అడుగుపెట్టిన తాప్సీ.. పింక్ మూవీ సక్సెస్ నుంచి బోలెడంత మారిపోయింది. ఈమెకు సౌత్ సినిమాలపై కామెంట్ చేయడం బాగా అలవాటయిపోయింది. రీసెంట్ గా అయితే ఏకంగా తనను హీరోయిన్ గా లాంఛ్ చేసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావును ఉద్దేశించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది.

శ్రీదేవితో సహా అనేకమంది హీరోయిన్స్ ను లాంఛ్ చేయడంలో ప్రత్యేకత కలిగి ఉన్న ఆ దర్శకుడు.. తనపై ఏ ఫ్రూట్స్ వేస్తాడో అని ఆసక్తిగా చూశానంది తాప్సీ. అయితే.. పొట్టపై కొబ్బరి చిప్పలు వేయడం ఏం సెన్సువాలిటీనో అర్ధం కాలేదంటూ కామెడీ చేసింది. తాప్సీ చేస్తున్న ఈ అతి తెలుగు జనాలకు బాగానే మండించేసింది. ఇదే తాప్సీ.. అదే ఝుమ్మంది నాదం రిలీజ్ కి ముందు.. తాను ఎంతటి అదృష్టవంతురాలినో అంటూ వచ్చీ రాని తెలుగులో తెగ మాట్లాడేసిన వీడియోకు.. లేటెస్ట్ వీడియోను కలిపి పోస్ట్ చేసి.. ఇప్పుడు బాలీవుడ్ లో ఒక్క సక్సెస్ వచ్చినంత మాత్రాన.. 150సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడిని కూడా కామెంట్ చేసేంతగా ఎదిగావా అంటూ తిట్టిపోస్తున్నారు జనాలు.

ఒక్క పింక్ మినహాయిస్తే.. మరే సినిమా ఆడలేదని.. అలాగే ఇప్పటి వరకు పట్టుమని 20 నిమిషాలు స్క్రీన్ టైం ఉన్న సినిమా కూడా చేయలేదని అంటున్నారు జనాలు. టాలీవుడ్ పరువు తీయాలని కంకణం కట్టుకున్నట్లుగా ప్రవర్తిస్తోందన్నది నెటిజన్ల వాదన. మరొకళ్లు అయితే.. తాప్సీని చూడలేనోళ్లు కొబ్బరికాయ చూస్తారని వేసుంటారులే అని కామెంట్ చేస్తున్నారంటే.. సోషల్ మీడియాలో తాప్సీని ఎంతగా తిట్టిపోస్తున్నారనే సంగతి అర్ధమవుతుంది.