Begin typing your search above and press return to search.
లేట్ రిప్లైతో అడ్డంగా బుక్కయిన కాజల్
By: Tupaki Desk | 20 May 2021 7:30 AM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెల్సిందే. కాజల్ సోషల్ మీడియాలో తనను ఎవరైనా సెలబ్రెటీ మెన్షన్ చేసి కామెంట్ చేసినా పోస్ట్ చేసినా కూడా వెంటనే స్పందిస్తుంది. కొన్ని నిమిషాలు లేదంటే గంటల వ్యవధిలో సమాధానం ఇస్తుంది. కాని అనుష్క చేసిన ట్వీట్ కు స్పందించేందుకు మాత్రం ఏకంగా 7 నెలలకు పైగా సమయంను తీసుకుంది. ఇన్నాళ్ల తర్వాత స్పందించడంతో కాజల్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాజల్ స్పందించకున్నా పట్టించుకున్న వారు లేరు. కాని ఇప్పుడు స్పందించడంతో అంతా విమర్శిస్తున్నారు.
అసలు విషయం ఏంటీ అంటే ఏడు నెలల క్రితం కాజల్ పెళ్లి పీఠలు ఎక్కింది. ఆ సమయంలో ఎంతో మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన సెలబ్రెటీలందరికి కూడా కాజల్ సమాధానం ఇచ్చింది. కాని అనుష్క చెప్పిన పెళ్లి శుభాకాంక్షలకు మాత్రం కాజల్ స్పందించలేదు. అనుష్క ఆ సమయంలోనే ట్విట్టర్ లో అడుగు పెట్టింది. దానికి తోడు అనుష్క ట్విట్టర్ అకౌంట్ వెరిఫై అయ్యి లేదు. దాంతో అనుష్క ఫ్యాన్ పేజీ అనుకుని కాజల్ ఆ ట్వీట్ ను పట్టించుకున్నట్లుగా లేదు.
అనుష్క ఈమద్య కాలంలో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె అకౌంట్ అధికారికం అని వెళ్లడయ్యింది. దాంతో కాజల్ ఇప్పుడు ఆమె ట్వీట్ కు సంబంధించింది. పెళ్లి శుభాకాంక్షలు చెప్పిన అనుష్కకు లవ్ ఈమోజీలు పెట్టి కృతజ్ఞతలు చెప్పింది. కాజల్ ఆలస్యంపై నెట్టింట రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. కరోనా పూర్తిగా పోయాక ట్వీట్ కు స్పందించి ఉంటే బాగుండేదని కొందరు.. పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత అనుష్క ట్వీట్ కు కాజల్ స్పందించి ఉంటే ఇంకా బాగుండేది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి ఆ ట్వీట్ కు స్పందించకున్నా కూడా ఎలాంటి విమర్శలు వచ్చేవి కావు.. కాని ఏడు నెలల తర్వాత స్పందించి కావాలని ట్రోల్స్ కు అడ్డంగా బుక్కయినట్లుగా కాజల్ పని ఉంది.