Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: బాలయ్యకి ఆర్ ఆర్ ఆర్ కి కనెక్షన్
By: Tupaki Desk | 15 March 2019 6:08 AM GMTఒకపక్క ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ పరాజయం పాలై బాధ పడుతున్న బాలయ్యకు టాక్ అఫ్ ది టౌన్ గా మారిన ఆర్ ఆర్ ఆర్ కు కనెక్షన్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. ఇక్కడే ఉంది అసలు మెలిక. సోషల్ మీడియా వచ్చాక నెటిజెన్ల ఉత్సాహానికి అడ్డుఅదుపు ఉండటం లేదు. ఏదైనా చిన్న క్లూ దొరికితే చాలు దాని మీద ఎక్కడెక్కడికో లింక్ పెట్టేస్తున్నారు. తాజాగా ఇది కూడా అలాంటిదే. అదేంటో చూడండి.
ఆర్ ఆర్ ఆర్ లో ఇద్దరు హీరోల పాత్రల్లో చరణ్ అల్లూరి సీతరామరాజుగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపిస్తారని రాజమౌళి చెప్పేశాడు. అయితే అల్లూరి గెటప్ ని గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ ఓ పాత సినిమాతో పాటు మేజర్ చంద్రకాంత్ లో కూడా వేశారు. కొమరం భీం ని మాత్రం ఎవరూ ట్రై చేయలేదు. ఆయన బయోపిక్ వచ్చింది కానీ అందులో చేసింది పేరు లేని నటీనటులు కాబట్టి అంతగా గుర్తింపుకు నోచుకోలేదు కానీ సినిమా మాత్రం గొప్ప పేరు తెచ్చుకుంది
ఇప్పుడు బాలకృష్ణ అభిమానుల వెర్షన్ ఏంటంటే తమ హీరో ఈ రెండు వేషాలు వేశారు అని. ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడులో బాలయ్య అల్లూరి సీతారామరాజు గెటప్ లో అలా ఓ సీన్ లో కనిపిస్తాడు. నాన్న లాగా ఆ వేషంలో బాగానే నప్పాడు కూడా. అంతకు ముందు దాసరి 150 సినిమా పరమవీరచక్రలో ఇదే తరహాలో కొమరం భీం గెటప్ లో బాలకృష్ణ కాసేపు మరిపిస్తాడు. ఓ రెండు డైలాగ్స్ కూడా ఉంటాయి.
ఇలా ఈ ఇద్దరి విప్లవ వీరుల గెటప్స్ లో కనిపించిన ఒకే ఒక్క హీరో బాలయ్యనే అని వాళ్ళ మాట. సరే ఒకరకంగా చూస్తే అందులో నిజం లేకపోలేదు. కంటి ముందు ఆధారం ఎలాగూ కనిపిస్తోంది. పూర్తి సినిమాగా కాదు కానీ ఇలా అల్లూరి కొమరం భీంల పాత్రల్లో కనీసం ఓసారైనా నటించిన హీరో బాలయ్యనే.