Begin typing your search above and press return to search.
'కత్రినా ప్లాస్టిక్ ఫేస్ కంటే చాలా బెటర్'
By: Tupaki Desk | 17 Dec 2022 12:30 AM GMTసోషల్ మీడియాల్లో సెలబ్రిటీలపై కామెంట్లు హద్దుమీరుతున్నాయి. సంబంధం లేని వారిని సైతం ఈ రొంపిలోకి లాగి వివాదంగా మారుస్తున్నారు. ఇప్పుడు కత్రిన కూడా దీనికి బాధితురాలిగా మారింది. ఇండస్ట్రీలో సాటి అందాల నాయిక సౌందర్యాన్ని పొగడబోయి కత్రినను అనూహ్యంగా విమర్శించారు. ''కత్రిన ప్లాస్టిక్ ఫేస్ కంటే బెటర్!'' అని సాటి నాయికను ప్రశంసించాడు ఓ నెటిజనుడు.
ఈ ఎపిసోడ్ లో బెబో కరీనా నేచురల్ లుక్ ని ప్రశంసిస్తూ తన అవతారాన్ని ఫోటోల రూపంలో ప్రదర్శించింది. ఇటీవల కత్రిన 'ప్లాస్టిక్ సర్జరీ' పుకార్ల నడుమ కరీనా కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ లో మేకప్ లెస్-డిగ్లామ్ ఫోటోను పోస్ట్ చేసింది. అభిమానులు ఈ వాస్తవికమైన నిజమైన అవతారాన్ని ప్రశంసిస్తూ కత్రిన కృత్రిమ సౌందర్యానికి పాకులాడుతోందని విమర్శించారు.
అయితే ఎవరైనా వారి శరీరంలో మార్పు చేర్పులు కావాలనుకోవడంలో తప్పు లేదు. అందం పెంచుకునేందుకు నేటి అధునాతన పద్ధతులను వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రజల విశ్వాసాన్ని పెంచుతోంది. ఇటీవల ఎక్కువ మంది నటీమణులు తమ సహజ సౌందర్యంపైనా ఫోకస్ చేసేందుకు ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే.
నిజానికి తారలు తమ సహజమైన ఆకర్షణీయమైన రూపాన్ని ప్రదర్శించడమే ఉత్తమం. ఎలాంటి ఇమేజ్ లేకుండా సహజంగా కనిపించినప్పుడు ప్రజలు వారిని ఇష్టపడతారు. ఎందుకంటే తమను తాము తమ ఫేవరెట్ స్టార్ లో చూసుకోవాలని అభిమానులు ఆరాటపడతారు. అంతేకాదు.. ఫలానా హీరోయిన్ కి ఫలానా లోపం ఉంది నాలో ఉన్నట్టే!అని మాట్లాడుకోవడం కూడా ఒక రకమైన సంతృప్తి. సెలబ్రిటీలు దేవుళ్లు కాదని వారికి కూడా లోపాలు ఉండవచ్చని భావించి.. స్టార్ లకు మరింత చేరువ కావడానికి ఇది సహాయపడుతుందనేది సైకాలజీ నిపుణుల విశ్లేషణ.
టాలీవుడ్ గ్రేట్ ట్యాలెంట్ నటి సాయి పల్లవి తన రా(ఒరిజినల్) లుక్ తో విస్తృతంగా పాపులరైంది. తనను అభిమానులు 'నేచురల్ స్టార్' అని ముద్దుగా పిలుచుకుంటారు. సాయిపల్లవి ప్రతిభను ఆరాధించారే తప్ప అందాన్ని కించపరుస్తూ ఎవరూ మాట్లాడరు.
ఇప్పుడు బెబో కరీనా డీగ్లామరస్ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటోని వాస్తవంగా ఒరిజినాలిటీతో షేర్ చేసినందుకు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతలోనే ఒక నెటిజన్ 'కత్రినా ప్లాస్టిక్ ఫేస్ కంటే చాలా బెటర్' అని వ్యాఖ్యానించారు. కత్రిన కంటే బెబో అందంగా ఉందని కితాబిచ్చాడు. మరొక నెటిజనుడు వ్యాఖ్యానిస్తూ-''నేను కరీనా ఇన్ స్టాను ప్రేమిస్తున్నాను. బెబో నిజరూపంతో కనిపిస్తుంది. ఆకర్షణీయంగా కనిపించేలా మేకప్ ను ముఖం నిండా అద్దుకునే ఇతర నటీమణుల కంటే చాలా మంచి స్టార్'' అని పొగిడేశాడు ఒక అభిమాని. కరీనా నో మేకప్ లుక్ ని అభిమానులు విపరీతంగా ఇష్టపడుతున్నారు
డి-గ్లామ్ లుక్ లోకి మారినందుకు కరీనాను ప్రశంసించడం సరైనదే.. అయితే పూర్తిగా పుకార్లను నమ్మి కత్రినాను ఈ వివాదంలోకి లాగడం సరికాదు. అలాగే ఎవరైనా వారి శరీరంలో కావాల్సిన మార్పులను కోరుకోడం వారి వ్యక్తిగత ఎంపిక. అభిమానులుగా మనం దానిని గౌరవించాలి. కించపరచకూడదు.
ఇటీవల దీపికా పదుకొణె 'బేషరమ్ రంగ్' (పఠాన్) పాట పోస్టర్ లో 'వైట్' కలర్ లో తళతళలాడుతూ కనిపించింది. ఫెయిర్ లుక్ లో కనిపించడానికి ప్రయత్నించినందుకు ప్రజలు తనను తీవ్రంగా విమర్శించారు. గతంలో ఊర్వశి రౌతేలా- శ్రుతి హాసన్- నోరా ఫతేహి- జాన్వీ కపూర్ - అయేషా టకియా వంటి చాలా మంది కథానాయికలు తమ శరీరాన్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి 'ప్లాస్టిక్ సర్జరీలు'- 'ఇంప్లాంట్ల'ను ఆశ్రయించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.