Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండకి డ్రెస్ సెన్స్ లేదా..?

By:  Tupaki Desk   |   7 Nov 2022 8:31 AM GMT
విజయ్ దేవరకొండకి డ్రెస్ సెన్స్ లేదా..?
X
టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు స్టైలింగ్ మరియు ఫ్యాషన్ గోల్స్ మీద ఎక్కువగాదృష్టి పెడుతున్నారు. మోడల్స్‌ కు ఏ మాత్రం తీసిపోని విధంగా స్టైలింగ్ స్టేట్‌మెంట్స్ పాస్ చేస్తూ స్టైల్ ఐకాన్స్ గా మారిపోతున్నారు.

సాధారణంగా అన్ని విషయాల్లోనూ సినీ సెలబ్రిటీలను ఫాలో అయ్యే అభిమానులు.. ఫ్యాషన్ లోనూ తమ ఫేవరేట్ హీరోలు లేదా హీరోయిన్ల నుంచి స్ఫూర్తి పొందుతుంటారు. వాళ్ళని చూసి అలాగే రెడీ అవ్వాలని కోరుకుంటారు.

యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరోలలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఒకరు. సినిమాలతో కంటే రియల్ లైఫ్ యాటిట్యూడ్ తోనే వీడీ ఎక్కుమంది దృష్టిని ఆకర్షించాడని చెప్పాలి.

స్టైలింగ్ లోనూ విజయ్'D ని అనుసరించే అభిమానులు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా యువత అతని బోల్డ్ ఫ్యాషన్ ఎంపికలను ఇష్టపడుతుంటారు. అయితే లేటెస్టుగా ఓ ఈవెంట్ కోసం దేవరకొండ ధరించిన కాస్ట్యూమ్స్ ని అంతగా ఇష్టపడలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ ని బట్టి తెలుస్తోంది.

'లైగర్' ప్లాప్ తర్వాత చాలా రోజులుగా మీడియా - సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోన్న విజయ్.. మళ్ళీ ఎప్పటిలాగే యాక్టీవ్ అయ్యారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని ఓ కార్యక్రమానికి గెస్టుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా లూస్ గా ఉండే లావెండర్ కాస్ట్యూమ్స్ లో బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని అల్ట్రా స్టైలిష్ గా కనిపించాడు విజయ్ దేవరకొండ. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే VD ధరించిన డ్రెస్ పై ఓ వర్గం నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రౌడీ స్టార్ కి డ్రెస్ సెన్స్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు అద్భుతమైన వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్న విజయ్.. 'లైగర్' పరాజయం తర్వాత డ్రెస్ సెన్స్ పోగుట్టుకున్నారని విమర్శలు చేస్తున్నారు.

రౌడీ బాయ్ ఫ్యాన్స్ మాత్రం అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. విజయ్ మరోసారి తన ఫ్యాషన్ తో ఫిదా చేసారని కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో స్టైల్ ఐకాన్ అని మరోసారి ప్రూవ్ చేసాడని అంటున్నారు.

ఇకపోతే ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ తన అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ''నేను ఎక్కడికి పోయినా 'కంబ్యాక్ ఇవ్వాలి.. అన్నా.. కంబ్యాక్ ఇవ్వాలి' అంటున్నారు. మీ అందరికీ ఒకటే చెప్పాలని అనుకుంటున్నా. నేను ఎక్కడికీ పోలేదు. ఐ యామ్ రైట్ F**King హియర్'' అని వీడీ అన్నారు.

సినిమాల విషయానికొస్తే.. 'లైగర్' తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్న విజయ్ కు నిరాశే ఎదురైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. దీంతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని డిసైడైన VD.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' అనే రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు. ఇదే క్రమంలో మరికొందరు దర్శకులతో కొత్త ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుపుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.