Begin typing your search above and press return to search.
నేనోక ఆధునిక మహిళా రైతుని: స్టార్ హీరో భార్య
By: Tupaki Desk | 14 May 2020 5:36 PM GMTమెగాస్టార్ చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన ఎల్లప్పుడూ సామాజిక అవగాహన కార్యక్రమాల్లో.. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడంలో ముందుంటుంది. సమాజాన్ని ఆలోచనలో పడేసే ఎన్నో సామాజిక అవగాహన పనులు ఎన్నో చేస్తుంటారు. మొదట ఆమె ఓ యువ మహిళా పారిశ్రామికవేత్త. అపోలో ఆస్పత్రి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళ. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ప్రజలలో.. నెటిజన్లలో ఎంతో మంచి అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉంది. రాయల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ.. ఎన్నడూ మచ్చుకైనా అలాంటి ఛాయలు కనిపించకుండా సహజమైన జీవన విధానం పాటిస్తున్నారు. అయితే ఈ రోజు ఉపాసన తన తండ్రి అనిల్ రెడ్డితో కలిసి ప్రకృతి సేద్యం నేర్చుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ఫోటోలను కూడా షేర్ చేసి ఆశ్చర్యపరించింది. ఏంటి మెగాస్టార్ కోడలు పొలం పనులు చేసిందా అని నోటిమీద వేలేసేలా చేసింది.
.
అంతే కాకుండా తన తండ్రిని ఆధునిక రైతుగా పేర్కొంది. అంతే కాకుండా పొలం పనుల్లో భాగంగా ఆవుకు దానా పెడుతూ, ఆవు పేడను తీస్తూ చెప్పడమే కాదు చేసి చూపిస్తూ ఫోటోలను ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా తనను తను ఓ ఆధునిక రైతుగా అభివర్ణించుకున్నారు. 'తండ్రితో పేడ అమ్మాయి' అంటూ సరదాగా ట్వీట్ చేశారు. "ఆర్గానిక్ (సేంద్రియ) వ్యవసాయం ఎలాగో నేర్చుకుంటున్నాను. ఎరువు తయారుచేయడం, ఆహార వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ఎలాగో తర్ఫీదు అందుకుంటున్నాను. రమణీయమైన సుస్థిర జీవనాన్ని అలవాటు చేసుకుంటున్నాను" అంటూ ఉపాసన ట్విట్టర్ లో పోస్ట్ చేసి తెలిపింది. ఈ ట్వీట్ ద్వారా ప్రకృతి సిద్దమైన మంచి ఆహారం పట్ల అవగాహన పెంచుతుంది ఉపాసన. దీంతో నెటిజన్లు ఉపాసన పైన అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు.