Begin typing your search above and press return to search.

బిబి4 ఫైనల్‌ 5 పై నెటిజన్స్‌ అంచనా

By:  Tupaki Desk   |   29 Oct 2020 3:30 AM GMT
బిబి4 ఫైనల్‌ 5 పై నెటిజన్స్‌ అంచనా
X
తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌ 4 దసరా రోజు ఎపిసోడ్‌ తో 50 రోజులు పూర్తి చేసుకుంది. అంటే సీజన్‌ దాదాపుగా సగం పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్‌ అయ్యి వెళ్లి పోయారు. మొత్తం 19 మందిలో ఏడుగురు ఎలిమినేట్‌ అవ్వగా గంగవ్వ అనారోగ్య కారణాల వల్ల బయటకు వచ్చేసింది. అంటే ప్రస్తుతం హౌస్‌ లో 11 మంది ఉన్నారు. ఈ వారం ఒక్కరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ వారం తర్వాత 10 మంది మాత్రం మిగిలి ఉన్నారు. ఈ సమయంలో బిగ్‌ బాస్‌ ఫైనల్‌ 5 ఎవరు అయ్యి ఉంటారు అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలో బిగ్‌ బాస్‌ షోను విశ్లేషించే వారు మరియు నెటిజన్స్‌ అభిప్రాయం ప్రకారం ముగ్గురు మాత్రం ఫైనల్‌ 5 లో ఉండే అవకాశం ఉందంటున్నారు.

ఏం మాట్లాడినా నిర్మొహమాటంగా మాట్లాడుతూ చాలా స్ట్రాంగ్‌ గా కనిపించే అరియానా మరియు ఎంటర్‌ టైనర్‌ ఆఫ్‌ ది హౌస్‌ అయిన అవినాష్‌ లు ఇద్దరు ఖచ్చితంగా ఫైనల్‌ 5 లో ఉంటారు. వీరిద్దరితో పాటు 90 శాతం అభిజిత్‌ కూడా ఉంటాడు అనిపిస్తుంది. బయట అతడికి ఉన్న బలం కారణంగా ఫైనల్‌ వరకు వెళ్తాడేమో అనిపిస్తుందంటున్నారు. ఈ ముగ్గురు కాకుండా మరో రెండు స్థానాల కోసం లాస్య, సోహెల్‌, హారిక మరియు నోయల్‌ లు గట్టిగా పోటీ పడుతున్నారు. అయితే షో ఇంకా చాలా వారాలు ఉంది. అప్పటి వరకు పరిస్థితులు ఎలా అయినా మారే అవకాశం ఉంది.

మొదటి రెండు వారాల్లో అరియానా బాబోయ్‌ ఈ పిల్ల ఏంటీ అనిపించింది. కాని ఇప్పుడు ఆమె ఫైనల్‌ 5 అన్నట్లుగా బలంగా మారింది. అలాగే మళ్లీ ఏమైనా ఈక్వెషన్స్‌ మారి మళ్లీ ఫైనల్‌ 5 మారే అవకాశం కూడా లేకపోలేదు. కాని ఇప్పుడు అనుకుంటున్న ఫైనల్‌ ఫైవ్‌ లో ఖచ్చితంగా ముగ్గురు నలుగురు అయినా కూడా చివరి వరకు ఉండే అవకాశం ఉంది అనిపిస్తుంది. ఇప్పటికే వారి గురించి క్లారిటీ వచ్చింది కనుక వారే ఉంటారనే వారు కూడా చాలా మందే ఉన్నారు. షో ఇంకా 50 రోజులు ఉంది కనుక మరెంతగా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను వీరు అందిస్తారో చూడాలి.