Begin typing your search above and press return to search.
కరణ్ తప్పు లేనప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు: నెటిజన్ల ఫైర్
By: Tupaki Desk | 9 July 2020 11:15 AM GMTబాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ ఇండస్ట్రీలోని చీకటి కోణాలన్ని సినీ ప్రేక్షకుల ముందుంచింది. దశాబ్దాలుగా నెపోటిజంతో ప్రతిభ గల నటులకు అవకాశాలు దక్కకుండా అణగదొక్కుతారన్న విషయం మరోసారి స్పష్టమైనట్లే అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో రోజురోజుకి భిన్నాభిప్రాయాలు రేకెత్తుతూనే ఉన్నాయి. బాలీవుడ్‌లోని కొందరు పెద్దలు.. పెత్తనం చలాయించి సుశాంత్ కెరీర్‌ను నాశనం చేయడం వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వారిలో ముఖ్యంగా కరణ్ జోహార్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇక ఈ విమర్శలతో కరణ్ మనస్తాపానికి గురయ్యాడట. అంతేగాక తప్పేం చేశానని ఏడ్చాడట. బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా.. నిర్మాతగా ఎన్నో సినిమాలు రూపొందించిన కరణ్.. నెపోటిజమ్ చూపుంచడంలో ముందుంటాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో కరణ్ చాలా కలత చెంది.. ఇంట్లోనే బాధపడుతూ కుర్చున్నాడని అతని స్నేహితుడు తెలిపాడు. మరి ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు నోరు విప్పట్లేదని అడిగితే.. ప్రస్తుతం జనాలంతా ఆవేశంలో ఉన్నారు. ఈ సమయంలో స్పందించకపోవడం మంచిదని లాయర్ సూచించాడని తెలిపాడు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదని.. కరణ్ కట్టుకథలు చెప్తున్నాడని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే సుశాంత్ మరణం విషయంలో కరణ్ తో పాటు అలియా భట్.. సోనమ్.. సోనాక్షి.. సల్మాన్.. అనన్యలు కారణం అని నెట్టింట కడిగేస్తున్నారు. ఇప్పటికే సోనాక్షి ట్విట్టర్ కి సెలవ్ పెట్టేసింది. ఇక అలియా కరణ్.. ఇలా మిగతా వారంతా సోషల్ మీడియాలో కనిపించడం తగ్గించేశారు. అయితే కరణ్ మాత్రం ఏ తప్పు చేసానని కుంగిపోతున్నాడనేది మాత్రం ఆయన ఫ్రెండ్ వెల్లడించాడు.