Begin typing your search above and press return to search.
బిగ్ బీ పై మండిపడ్డ నెటిజన్లు!
By: Tupaki Desk | 30 Aug 2017 12:22 PM GMTప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ ప్రముఖులతో పాటు అనేక మంది క్రికెటర్లు - సెలబ్రిటీలు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. టాలీవుడ్ లో సమంత ట్విట్లర్ లో తన అప్ డేట్స్ ను ఎప్పటికపుడు షేర్ చేస్తుంటారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచన్ కూడా ట్విట్లర్లో తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. కేవలం సినిమాల గురించే కాకుండా సామాజిక అంశాలపై కూడా బిగ్ బీ స్పందిస్తుంటారు. అయితే, ఒక్కోసారి సెలబ్రిటీలు చేసిన కొన్ని ట్వీట్ల కు నెటిజన్ల ప్రతిస్పందన కూడా తీవ్రంగానే ఉంటుంది. అదే కోవలో ముంబై మహానగరాన్ని ముంచెత్తిన వరదలపై బిగ్ బీ చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ చేసిన బిగ్ బీ పై నెటిజన్లు మండిపడుతున్నారు.
ముంబైలో భారీగా కురిసిన వర్షాలను ఉద్దేశించి బిగ్ బీ ఓ ట్వీట్ చేశారు. ప్రకృతితో పోరాడి ఎవరూ గెలవలేరని, అగ్రరాజ్యం అమెరికా కూడా హరికేన్ హార్వీను కట్టడి చేయలేకపోయిందని బిగ్ బీ ట్వీట్ చేశారు. ముంబై వరదలను - అమెరికాలోని హార్వీతో పోల్చడం నెటిజన్లకు నచ్చలేదు. దీంతో, బిగ్ బీ పై వారు విమర్శలు గుప్పించారు. ముంబై వరదలు ప్రకృతి ప్రకోపం వల్ల రాలేదని, మానవ తప్పిదాలే కారణమని ఓ నెటిజన్ విమర్శించాడు. ముంబై వరదలు - హరికేన్ హార్వీ లను సమానంగా పోల్చడం తప్పని మరొకరు కామెంట్ చేశారు. `అమెరికాలో రాబోతున్న హరికేన్ గురించి వాళ్ల ప్రభుత్వం ముందే హెచ్చరించింది. ముంబై నగర పాలక సంస్థ వర్షాల గురించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు కదా, వరదలతో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయక చర్యలు కూడా చేయడం లేదు. అనవసరంగా ప్రభుత్వాన్ని వెనకేసుకురాకండి` అంటూ మరో నెటిజన్ ఘాటుగా స్పందించాడు. మొత్తానికి ముంబై ప్రజలపై సానుభూతితో బిగ్ బీ చేసిన ట్వీట్ ఈ రకంగా వైరల్ అయింది.