Begin typing your search above and press return to search.
'ట్యాక్సీవాలా' పైరసీ కోసం గూగులింగ్..!
By: Tupaki Desk | 11 Nov 2018 6:45 AM GMTవిజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న ‘ట్యాక్సీవాలా’ చిత్రంను విభిన్నంగా ప్రమోషన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి - గీత గోవిందం చిత్రాల తర్వాత ‘నోటా’ చిత్రంతో వచ్చి నిరాశ పర్చిన విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ చిత్రం కోసం ఒక ప్రత్యేకమైన వీడియోను తీసి ఆన్ లైన్ లో వదిలారు. పైరసీకి వ్యతిరేకంగా ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇదే సమయంలో ఆ వీడియో వల్ల కాస్త నష్టం కూడా జరుగుతోంది.
ఇంతకు ఆ వీడియోలో ఏముంది అంటే.. చిన్న పిల్లలతో కూడిన ఆ వీడియోలో సినిమాను పైరసీలో చూస్తే పచ్చి పాస్తా తిన్నట్లుగానే ఉంటుందని - అదే పాస్తాలో కూరగాయలు మరియు ఇతర ఇంగ్రీడియన్స్ వంటివి కలిపి - అవసరం లేనివి తీసేసి - కాస్త ఫుడ్ కలర్ వేసి - లైట్ సిట్టింగ్ లో కూర్చుని తింటే అద్బుతంగా ఉంటుంది. అలాగే సినిమా కూడా పైరసీలో చూడటం కంటే మంచి ఎడిటింగ్ లో - కలర్ కరెక్షన్స్ తో - అవసరం లేనివి తీసేసి - థియేటర్ లో చూస్తే బాగుంటుందనేది ఆ వీడియో అభిప్రాయం.
ట్యాక్సీవాలా చిత్ర యూనిట్ సభ్యులు ఈ పాస్తా వీడియోను విడుదల చేసిన నేపథ్యంలో ట్యాక్సీవాలా చిత్రం ఎడిటింగ్ చేయకుండానే లీక్ అయినట్లుంది - కొన్ని ఫుటేజ్ వీడియోలు లీక్ అయ్యాయి అనుకుని చాలా మంది గూగుల్ లో ట్యాక్సీవాలా లీక్ వీడియోలు అంటూ తెగ వెతికేస్తున్నారు. వీడియోల లీక్ విషయం తెలియని వారికి తెలియజేప్పినట్లే అయ్యిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.