Begin typing your search above and press return to search.
అవార్డుల కార్యక్రమంలో అవినీతి కరోనా
By: Tupaki Desk | 9 Jan 2022 2:30 AM GMTరాపర్..నటుడు స్నూప్ డాగర్ 79వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేషన్లు ప్రకటించారు. ఇందులో లేడీ గాగా (హౌస్ ఆఫ్ గూబీ) నికోల్ కిడ్ మాన్ ( బీయింగ్ ది రికార్డోస్)..విల్ స్మిత్ ( కింగ్ రిచర్డ్) ..క్రిస్టేన్ స్టివర్ట్ ( స్పెన్సర్).. డెంజల్ వాషింగ్టన్ ( ది ట్రాజెడీ ఆఫ్ మక్ బెత్) ఉన్నారు. అయితే గతంలో మాదిరి ఈసారి కూడా ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు. అవార్డుల విజేతల్ని కేవలం ఆన్ లైన్ లో మాత్రమే ప్రకటిస్తామని వెల్లడించారు. అలాగే ఈవెంట్ పూర్తిగా ప్రయివేట్ ఈవెంట్ గానే చేస్తున్నారు. అయితే నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం ఉంది.
హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ( హెచ్ ఎఫ్ పీ ఏ) పై విమర్శలు రావడంతో వేడుకను ప్రత్యక్ష ప్రసారం కాకుండా ఎన్ బీసీ సదరు అవార్డ్ ఈవెంట్ నిర్వాహకులతో ప్పందాన్ని రద్దు చేసుకున్నారుట. 2021 గోల్డెన్ గ్లోబ్స్ వేడక వివాదాస్పదమైంది. హెచ్ ఎఫ్ పీఏ పై లాస్ ఏంజిల్స్ టైమ్స్ విచారణ తర్వాత అవార్డలకు ఓటు వేసిన 87 మంది సభ్యుల్లో ఒక్కరు కూడా నల్ల జాతీయులు లేవకపోవడం.నామినీలు నిర్ణయించేటప్పుడు లంచాలకు పాల్పడటం వంటి ఆరోపణలు ఈ వివాదానికి కారణమైంది.
అయితే అక్టోబర్ లో 21 మంది కొత్త సభ్యలు జాబితాలో 6 గురు నల్ల జాతీయలు ఉన్నారని హెచ్ ఎఫ్ పీఏ తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం విజేతల్ని తమ అధికారిక వెబ్ సైట్లో వెల్లడిస్తామని తెలిపారు. అయితే ఇలా ప్రయివేట్ ఈవెంట్ చేయడానికి కోవిడ్ విజృంభణ కూడా ప్రధాన కారణం. అమెరికాలో కోవిడ్ ఉగ్రరూపం దాల్చుతోన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ నటుల్ని కోవిడ్ వెంటాడుతోంది. దీంతో షూటింగ్ లు నిలిపివేసారు. అలాగే గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం..టెలివిజన్ కార్యక్రమాల రెడ్ కార్పెట్ ఈవెంట్లను సైతం వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్ ని సింపుల్ గా కానిచ్చేస్తున్నట్లుగానూ భావించొచ్చు.