Begin typing your search above and press return to search.
సూర్య తమ్ముడు మామూలోడు కాదు బాసూ
By: Tupaki Desk | 8 Jan 2022 11:30 PM GMTసూర్య తమ్ముడు కార్తి మామూలోడు కాదు బాసూ అంటున్నారు సినీ జనం. తెలుగు, తమిళ భాషల్లో కార్తికి మంచి ఫ్యాన్ బేస్ వుంది. అంతే కాకుండా సూర్య తన ఓన్ వాయిస్ ని తెలుగులో ఇప్పటికీ వినిపించలేకపోతున్నా కార్తి మాత్రం తన సినిమాలకు తెలుగులో తానే డబ్బింగ్ చెప్పుకుంటూ మరింత ఆకట్టుకుంటున్నాడు. దీంతో అతని సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పడుతోంది. మార్కెట్ లెక్కలని అంచనా వేసుకుంటూ తను నటించే ప్రతి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూనే వున్నాడు కార్తి.
ప్రస్తుతం సర్దార్, విరుమన్ చిత్రాల్లో నటిస్తున్న కార్తి సైలెంట్ గా ఓ సీక్వెల్ ని, ప్రీక్వెల్ ని పట్టాలెక్కించేశాడు. 2010లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం `నా పేరు శివ`. ఈ మూవీ కార్తికి హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా ఇదే సినిమాకు సీక్వెల్ అంటూ `నా పేరు శివ-2` పేరుతో మరో చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కె.ఇ. జ్ఞనవేల్ రాజా నిర్మించిన ఈ మూవీకి `కబాలి` ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వం వహించారు.
త్వరలోనే ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇదిలా వుంటే ఇదే పంథాలో మరో సినిమాని సైలెంట్ గా స్టార్ట్ చేశారు కార్తి. 2019లో వచ్చిన చిత్రం `ఖైదీ`. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ నిలిచిన విషయం తెలిససిందే. హీరోయిన్, కనీసం ఒక పాట కూడా లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కార్తి నటించిన చిత్రాల్లో కొత్త తరహా యాక్షన్ డ్రామాగా నిలిచి నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇందులో ఢిల్లీగా కనిపించి కార్తి నటుడిగా తనలో వున్న మరో కోణాన్నిఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లని సాధించింది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్ ని `ఖైదీ -2`గా తెరకెక్కిస్తున్నారు. ప్రీక్వెల్ ని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తాడా? లేక మరో దర్శకుడిని లైన్ లో పెట్టారా ? అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. `నా పేరు శివ -2` ని సైలెంట్ గా పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేసిన కార్తి `ఖైదీ -2`ని కూడా అదే తరహాలో సిద్ధం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట.
ఇప్పటికే నాలుగు చిత్రాలతో బిజీగా వున్న కార్తి ది గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పిరియాడికల్ మూవీ `పొన్నియిన్ సెల్వన్`లో నటిస్తున్నాడు. `బాహుబలి` తరహాలో రెండు భాగాలుగా రూపొందుతున్నఈ మూవీలో వల్లవరాజన్ వందియదేవన్ గా కనిపించబోతున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.