Begin typing your search above and press return to search.
మోహన్ బాబు లేఖను లైట్ తీస్కున్నారా?
By: Tupaki Desk | 4 Jan 2022 7:31 AM GMTఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేటు వ్యవహారం అంతకంతకు హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వంపై టాలీవుడ్ సినీపెద్దలు గుర్రుమీద ఉన్నారు. పవన్ కల్యాణ్ - నాని- సిద్ధార్థ్ లాంటి హీరోలు సహా పలువురు అగ్ర నిర్మాతలు టికెట్ రేట్ల తగ్గింపుపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇంతకుముందే పవన్ వ్యాఖ్యలను సమర్థిస్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే టికెట్ రేట్లు పెంపు విషయంలో మంచు మోహన్ బాబు లేఖాస్త్రం కొన్ని అంశాల్ని లేవనెత్తింది. పెద్ద సినిమాలకు టికెట్ ధరల్ని పెంచాలని అభిప్రాయం వెలిబుచ్చిన మంచు మోహన్ బాబు పరిశ్రమ అంటే ఆ నలుగురు హీరోలేనా? అని నిలదీసే ప్రయత్నం చేశారు.
అయితే ఆయన సంధించిన లేఖాస్త్రం ఎందరికి చేరింది? ఇండస్ట్రీ పట్టించుకుందా లేదా? అని చెక్ చేస్తే .. అసలు ఈ లేఖ రిలీజైందన్న సంగతే తమకు తెలియదన్న వ్యాఖ్యలు మెజారిటీ వర్గాలనుంచి వ్యక్తమవ్వడం విస్మయం కలిగిస్తోంది. అయినా ఈ సమయంలో ఆయన లేఖ రాయడమేంటో అంటూ ఒక నిర్మాత అభిప్రాయం వెలిబుచ్చగా.. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి చుట్టాలం అని చెప్పుకునే వారు నేరుగా బరిలో దిగి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇంతకాలం చోద్యం చూస్తున్నారా ఒక సినీపెద్దగా ఆయన ఈపాటికే చేయాల్సింది కదా! అన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తానని మాటిచ్చిన ప్రస్తుత మా అసోసియేషన్ అధ్యక్షుడు .. మోహన్ బాబు కుమారుడు విష్ణు మంచు సైతం ఇంతవరకూ చేసిందేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. టికెట్ ధరలపై అందరూ చొరవ తీసుకోవచ్చు. సీఎంకి సన్నిహితులు అని చెబితే సరిపోదు.. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరిస్తేనే గొప్పతనం బయటపడుతుంది అన్న పెదవి విరుపులు వినిపిస్తున్నాయి.
ఇకపోతే మంచు మోహన్ బాబు లేఖను చదివిన వారిలో మెజారిటీ వర్గం .. ప్రభుత్వంతో చర్చల గురించి ప్రస్థావించకుండా ఆ నలుగురు హీరోలేనా? అని ప్రశ్నించడం సరైనదేనా? అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థ ఓవరాల్ సమస్యపై చర్చించుకుండా వ్యక్తిగతంగా వెళ్లడం సరికాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తపరిచారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక సినీపెద్దగా మోహన్ బాబుకు ఉన్న గౌరవం వేరు. ఆయన చొరవ తీసుకుని సమస్యను పెద్దది చేయకుండా పరిష్కరిస్తే చూడాలనుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మంచు కాంపౌండ్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి.