Begin typing your search above and press return to search.
కింగ్ మాట మీద నిలబడతాడా? లేదా మాట వెనక్కి తీసుకుంటాడా?
By: Tupaki Desk | 11 Jan 2022 10:30 AM GMTకింగ్ అక్కినేని నాగార్జున - యువసామ్రాట్ నాగచైతన్య కలిసి నటించిన తాజా చిత్రం ''బంగార్రాజు''. బ్లాక్ బస్టర్ 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రానికి సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించారు. జీ స్టూడియోస్ సమర్పణలో నాగ్ హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ మీద ఈ సినిమాని నిర్మించారు. సంక్రాంతి పండుగను టార్గెట్ గా పెట్టుకుని పూర్తి చేసిన ఈ చిత్రాన్ని జనవరి 14న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే 'బంగార్రాజు' సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు - పాటలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. దీనికి తగ్గట్టుగా నాగ్ - చైతూ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఫెస్టివల్ రేసులో మరో పెద్ద సినిమా లేకపోవడంతో అక్కినేని తండ్రీకొడుకులు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తారని ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమున్న టిక్కెట్ల రేట్లు తన 'బంగార్రాజు' సినిమాకు సరిపోతాయని నాగార్జున ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే కింగ్ ఆ మాట అన్నప్పుడు పరిస్థితులు వేరు. ఆంధ్రాలో 100 పర్సెంట్ ఆకుపెన్సీతో పాటు కోవిడ్ కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
ఆంధ్రాలో థియేటర్లలో 50 ఆకుపెన్సీతో పాటుగా నైట్ కర్ఫ్యూ విధించడంతో రోజుకు మూడు షోలకు మాత్రమే అవకాశం ఉంది. రానున్న రెండు మూడు రోజుల్లో కేసులు పెరిగితే తెలంగాణలోనూ ఆంక్షలు పెట్టే అవకాశాలు లేకపోలేదు. అందులోనూ కరోనా థర్డ్ వేవ్ ఉధృతి ఎక్కువ అవుతుండటంతో జనాల్లో కూడా భయాందోళనలు కలుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రేక్షకులు రిస్క్ చేసి సినిమా చూడ్డానికి వస్తారో లేదో అనే సందేహాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో 'బంగార్రాజు' సినిమా 50 శాతం థియేటర్ ఆక్యుపెన్సీతో లిమిటెడ్ షోస్ తో దాదాపు 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మార్క్ అందుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు 'జీ' స్టూడియో సెంటిమెంట్ కూడా ఉంది. జీ వారు డిస్ట్రీబ్యూట్ చేస్తున్నారు కాబట్టి రిస్క్ కూడా వాళ్లకే ఎక్కువ అనుకోవాలి. మరి కింగ్ నాగ్ మాట మీద నిలబడతాడా లేదా మాట వెనక్కి తీసుకుంటాడా అనేది చూడాలి.
కాగా, 'బంగార్రాజు' చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ.. నాగచైతన్య కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఫరియా అబ్దులా - దక్షా నగర్కార్ స్పెషల్ సాంగ్స్ లో కనిపించనున్నారు. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు.