Begin typing your search above and press return to search.

పెళ్లైనా.. సినిమాలు చేయకున్నా ఆమె నెం.1

By:  Tupaki Desk   |   6 Jan 2022 12:30 AM GMT
పెళ్లైనా.. సినిమాలు చేయకున్నా ఆమె నెం.1
X
హాలీవుడ్‌ లో ఇండియన్ నటీ నటులు కాని సాంకేతిక నిపుణులు కానీ చాలా చాలా తక్కువగా ఉంటారు. మన స్టార్స్‌ కేవలం ఇండియన్‌ సినిమా పరిధి వరకే అనుకుంటున్న సమయంలో ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ అనిపించుకుంది. ఒకరు ఇద్దరు హాలీవుడ్‌ లో నటించే ప్రయత్నాలు చేయడం.. కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. కాని ఫుల్‌ లెంగ్త్‌ సినిమాలు చేయడంతో పాటు కంటిన్యూస్ గా దాదాపు అయిదు ఆరు సంవత్సరాలుగా హాలీవుడ్‌ లో సినిమాలు నటిస్తూ.. వెబ్‌ సిరీస్ లు చేస్తూ గ్లోబల్‌ స్టార్‌ అనిపించుకుని ఎన్నో దేశాల్లో అభిమానులను దక్కించుకున్న బ్యూటీ ప్రియాంక చోప్రా. ఇండియన్ సిల్వర్‌ స్క్రీన్‌ పై స్టార్‌ గా మెప్పించి ఆ తర్వాత హాలీవుడ్ కు చెక్కేసిన ఈ అమ్మడు తన స్టార్‌ డమ్‌ తో దుమ్ము దులిపేస్తోంది.

ఇండియన్‌ ఫిల్మ్‌ స్టార్స్ ల్లో ఏ ఒక్కరికి అందనంత దూరంలో ఈ అమ్మడు నిలిచింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్‌ లో ఉన్న ఫాలోవర్స్ ను బట్టి తమ స్టార్‌ డమ్‌ ను.. తమ సెలబ్రిటీ స్టేటస్ ను నిర్ణయించుకుంటున్నారు. ఇన్ స్టా లో ఫాలోవర్స్ ను బట్టి స్టార్‌ డమ్ నిర్ణయించినట్లయితే ఒకటి నుండి అయిదు వరకు ప్రియాంక చోప్రా స్థానాలు ఉంటాయంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఏకంగా 72.5 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఆమెకు దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. ఆమె తర్వాత స్థానంలో దాదాపు అయిదు మిలియన్ ల తేడాతో శ్రద్దా కపూర్‌ ఉంది. ఇన్ స్టా లో శ్రద్దా కపూర్‌ ఫాలోవర్స్ సంఖ్య 68.5 మిలియన్ లు కాగా ఆమె తర్వాత స్థానంలో దీపికా పదుకునే.. అనుష్క శర్మ మరియు కత్రీనా కైఫ్ లు ఉన్నారు.

ఏ ఇండియన్‌ ఫిల్మ్‌ స్టార్‌ కు కూడా లేని గ్లోబల్‌ స్టార్ డమ్‌ ను దక్కించుకున్న ప్రియాంక చోప్రా ఇన్‌ స్టా లో ఒక్క యాడ్‌ పోస్ట్ పెడితే కోట్ల రూపాయల పారితోషికం దక్కించుకుంటుంది. ఈమద్య కాలంలో ఈమె ఎక్కువ సినిమాల్లో నటించింది లేదు.. పైగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. అయినా కూడా ఈమెకు ఇండియన్ సినీ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ వల్లే ఈ స్థాయి పారితోషికం అనడంలో సందేహం లేదు. తన కంటే పదేళ్లు చిన్నవాడు అయిన నిక్ ను పెళ్లి చేసుకున్న సమయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈమె ఇప్పుడు అతడి తో జీవితాన్ని హాయిగా గడుపుతూ షేర్‌ చేసిన ఫొటోలకు లక్షల్లో లైక్స్ మరియు వేలల్లో కామెంట్లు వస్తూ ఉన్నాయి.

ఎవరేం అనుకుంటారు అనే విషయాన్ని ఆలోచించకుండా తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు నిజ జీవితంలో కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంది. కష్టపడి ఈ స్థాయికి వచ్చిన ఆమెను పలువురు హీరోయిన్లు కూడా ఆమె మాకు ఆదర్శం అంటూ కామెంట్స్ చేయడం మనం చూశాం.. విన్నాం. కనుక గ్లోబల్‌ స్టార్‌ గా ప్రియాంక చోప్రాకు ఖ్యాతి దక్కడం ఏదో అదృష్టం కొద్ది దక్కింది కాదు అనడంలో సందేహం లేదు.