Begin typing your search above and press return to search.
అందరి కళ్లు ఇప్పడు ఆ ఈవెంట్ పైనే
By: Tupaki Desk | 29 Dec 2021 9:41 AM GMTటాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ `ఆర్ ఆర్ ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రమిది. ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. దీనికి ఫాంటసీ అంశాలని జోడించి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన తీరు రొమాంచితంగా వుండబోతోంది. స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిపై మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఫైట్ చేసిన విషయం తెలిసిందే. అతనికి గోండు బెబ్బులి.. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమురం భీం జతకలిస్తే ఏం జరుగుతుందన్న ఫాంటసీ కథని చాలా అందంగా చెబుతున్నారు.
ఇదే ఈ సినిమా ప్రధాన యుఎస్‌పీ. అంతే కాకుండా దక్షిణాదిలో ఇద్దరు స్టార్ హీరోలు చాలా ఏళ్ల విరామం తరువాత కలిసి నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా ఇందులో బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, అలియాభట్, హాలీవుడ్ నటులు రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీ, ఒలివియా మోరీస్ కీలక పాత్రల్లో నటించడం కూడా ఈ సినిమా హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండియాగా మారింది.
ఇలా ప్రతీ విషయంలోనూ చాలా ప్రత్యేకతలతో రూపొందిన ఈ సినిమా ఈ సంక్రాంతికి జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రాచార పర్వాన్ని రాజమౌళి జోరుగా మొదలుపెట్టారు. దక్షిణాదిని మించి ఉత్తరాదిలోనే ఈ సినిమాకు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. స్వయంగా రాజమౌళి ప్లాన్ చేసి మరీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీంతో ఉత్తరాదిలో `ఆర్ ఆర్ ఆర్` కు భారీ క్రేజ్ ఏర్పడింది.
ఇటీవల ముంబైలో...కొన్ని రోజుల క్రితం చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో యంగ్ హీరో శివ కార్తికేయన్ స్పీచ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. ఇదిలా వుంటే ఇప్పుడు అందరి కల్లు తెలుగులో చేయబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై పడ్డాయి. రిలీజ్ మరో పది రోజుల్లోపు వున్న సందర్భంగా తెలుగులో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుందా? వుండదా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
కారణం ఇప్పటి వరకు తెలుగులో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి డేట్ ఫిక్స్ చేయలేదు సరి కదా ప్లేస్ ని కూడా ఖరారు చేయలేదు. దీంతో తెలుగు అభిమానుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరో పక్క ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే మరో పక్క ఏపీలో టికెట్ రేట్ల వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో `ఆర్ ఆర్ ఆర్` అభిమానుల్లో మరింత టెన్షన్ మొదలైంది.
ఈ నేపథ్యంలో రాజమౌళి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని అనౌన్స్ చేస్తేనే అన్ని ఫ్యాన్స్ టెన్షన్ కి బ్రేక్ పడుతుందని చెబుతున్నారు. మరి రాజమౌళి ప్రి రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాడా? లేక మరో రెండు మూడు రోజుల వరకు ఈ టెన్షన్ ని అలాగే కంటిన్యూ చేస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.