Begin typing your search above and press return to search.
టాలీవుడ్ అంటేనే బాలీవుడ్ ఉలిక్కిపడుతోంది
By: Tupaki Desk | 5 Jan 2022 11:52 AM GMTటాలీవుడ్... ఈ పేరు వింటేనే బాలీవుడ్ ఉలిక్కిపడుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ సినిమా అంటే పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ ఇప్పడు టాలీవుడ్ సినిమా అంటే భయంతో చూస్తోంది. `బాహుబలి` తరువాత ఒక్కసారిగా సమీకరణాలన్నీ మారడంతో ఒక్కసారిగా అందిరి చూపు టాలీవుడ్ వైపు మళ్లింది. `బాహుబలి` బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టడమే కాకుండా ఉత్తరాదిలోనూ భారీ ప్రభావాన్ని చూపించడంతో మన నుంచి సినిమా వచ్చేస్తోందటే బాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోలు అలర్ట్ అయి చూస్తున్నారు.
`బాహుబలి` తరువాత మన సినిమాలకు మార్కెట్ పరంగానే కాకుండా దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోవడంతో మన సినిమాలపైనే అత్యధికంగా ఫోకస్ పెడుతున్నారు. ఇదే అదనుగా మన వాళ్లు కూడా పాన్ ఇండియా చిత్రాలతో బాలీవుడ్ పై వరుసగా దాడికి దిగుతున్నారు. `బాహుబలి` తరువాత `సాహో` ఇక్కడ కంటే అక్కడే అత్యధికంగా వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయ పరిచింది.
ఇక ఈ ఏడాది జనవరి 7న విడుదల కావాలని ప్రయత్నించిన `ఆర్ ఆర్ ఆర్` ఉత్తరాదిలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ ని పూర్తి చేసి రికార్డు సాధించింది. పైగా ఉత్తరాదిపై ప్రత్యేక దృష్టిని పెట్టిన రాజమౌళి ఈ మూవీ ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ లో వారం రోజుల పాటు తిష్టవేయడం, అక్కడున్న ప్రధాన ప్రసార మాధ్యమాలని ఓ రేంజ్ లో వాడుకోవడం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినా గత ఏడాది చివర్లో వచ్చిన `పుష్ప ది రైజ్` ఉత్తరాదిన బాక్సాఫీస్‌ని ఓ రేంజ్ లో రఫ్పాడించేస్తోంది.
`ఆర్ ఆర్ ఆర్` రేంజ్ లో ఈ మూవీకి ఉత్తరాదిలో ఏమంతగా ప్రచారం చేయలేదు. అయినా ఈ చిత్రానికి ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో బాలీవుడ్ మేకర్స్ తో పాటు ట్రేడ్ వర్గాలు పిచ్చెక్కిపోతున్నారట. తెలుగు సినిమాకు ఇదేం క్రేజ్ రా బాబూ అని అవాక్కవుతున్నారట. ఇక ఇదే జోరులో `రాధేశ్యామ్` కూడా హిందీలో రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీని వాయిదా వేసిన విషయం తెలిసిందే. లేదంటే ఈ మూవీ కూడా ఉత్తరాదిలో బాక్సాఫీస్ పై ఓ రేంజ్ లో దండయాత్ర చేసేదే.
ఇక ఈ సినిమాల తరువాత పూరి జగన్నాథ్ `లైగర్`తోనూ దాడికి దిగుతున్నాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ మూవీ హిందీలో డబ్బింగ్ కాకుండా స్ట్రెయిట్ మూవీగా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఓ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించడం, వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక అతిథి పాత్ర చేయడం వంటి కారణాలతో ఈ మూవీపై కూడా బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ మూవీ తరువాత సుక్కు -బన్నీల `పుష్ప 2` రాబోతోంది. ఇది పార్ట్ 1 కి మించి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభావాన్ని చూపించనుంది.
ఇక ఇదే ఏడాది మహేష్ బాబు కూడా బాలీవుడ్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించిన పూర్తి వివరాల్ని చిత్ర బృందం ప్రకటించబోతోంది.
`బాహుబలి` నుంచి అనూహ్యంగా బాలీవుడ్ పై తెలుగు సినిమాల దండయాత్ర మొదలు కావడంతో అక్కడి స్టార్స్ తో పాటు దర్శకనిర్మాతలు హడలిపోతూ తలలు పట్టుకుంటున్నారట. `బాహుబలి`ని స్ఫూర్తిగా తీసుకుని 150 కోట్లతో కరణ్ జోహార్ మరి కొంత మంది నిర్మాతలతో కలిసి తీసిన `కలంక్` మూవీ 146 కోట్లు మాత్రమే రాబట్టి నష్టాలని మిగిల్చింది. దీంతో మన సినిమాల కన్నాటాలీవుడ్ సినిమాలే పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అవుతున్నాయని వాపోతున్నారట.