Begin typing your search above and press return to search.
విశాల్ వుడ్ బీ ని టార్గెట్ చేశారే!
By: Tupaki Desk | 19 Jan 2019 5:52 AM GMTహీరో విశాల్ కు తమిళనాట మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. యాక్షన్ హీరోగానే కాకుండా రియల్ లైఫ్ లో కూడా తన ఫైటింగ్ స్పిరిట్ తో అభిమానులను సంపాదించుకున్నాడు. నడిగర్ సంగం ఎలెక్షన్స్.. తమిళ నిర్మాతల కౌన్సిల్ ఎన్నికల పోటీలో విజయం సాధించి అందరినీ మెప్పించాడు. ఈమధ్యే విశాల్ కు తెలుగు నటి ఆళ్ళ అనీషా రెడ్డి తో నిశ్చితార్థం అయింది. 'పెళ్లి చూపులు'.. 'అర్జున్ రెడ్డి' సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన అనీషా హైదరాబాద్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కుమార్తె.
విశాల్ తో ఎంగేజ్మెంట్ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలుపుతూ అనీష మూడు రోజుల క్రితం ఒక పెద్ద మెసేజ్ పెట్టింది. విశాల్ తో కలిసి ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా చాలామంది నెటిజనులు అనీషకు అభినందనలు తెలిపారు. మీ జంట బాగుందని.. విశాల్ అన్నయ్యను మీరు బాగా చూసుకోవాలని కూడా కొందరు ఫ్యాన్స్ కోరారు. కానీ ఇదంతా నాణేనికి ఒక వైపు. రెండో వైపు కొంతమంది ట్రోలర్లు పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.
నువ్వు అందంగా లేవని.. డబ్బు కోసమే విశాల్ నిన్ను చేసుకుంటున్నాడని అన్నారు. దీనికి సమాధానం ఇచ్చిన అనీషా "విశాల్ డబ్బు కోసమే నన్ను చేసుకునేందుకు ఒప్పుకున్నాడని మీరు అనుకుంటే.. మీకు క్లియర్ గా విశాల్ అంటే గౌరవం లేదని అర్థం అవుతోంది" అని చురక అంటించింది. మరో నెటిజన్ మీ ఇద్దరి జంట ఛండాలంగా ఉంటుందని కామెంట్ చేస్తే.. అనిషా దానికి సమాధానంగా "థ్యాంక్ యు" చెప్పింది. ఏదేమైనా ఈ ట్రోలర్ల బెడద రాను రానూ మరింతగా ఎక్కువవుతోంది. వీళ్ళకోసం మన ప్రభుత్వాలు ఏవైనా పథకాలు ప్రకటిస్తేగానీ హంగామా తగ్గేలా లేదు.