Begin typing your search above and press return to search.
చరణ్ లెటర్: కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు!
By: Tupaki Desk | 5 Feb 2019 11:49 AM GMT'వినయ విధేయ రామ' సినిమా సాధారణ ప్రేక్షకులనే కాకుండా ఫ్యాన్సును కూడా నిరాశపరిచింది. అందులో ఏమీ అనుమానం లేదు. అందుకే చరణ్ ఈ ఫలితం పై స్పందిస్తూ ఒక లేఖను తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. లెటర్ సారాంశం క్లుప్తంగా చెప్పుకుంటే "అందరం సిన్సియర్ గా కష్టపడ్డాము కానీ అంచనాలను అందుకోలేకపోయాం. ఇకపై మమ్మల్ని మెప్పించే సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తాను."
ఈ లెటర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కింద పడ్డా మాదే పై చెయ్యి అనే హీరో లు ఉన్న మన టాలీవుడ్ లో చరణ్ ఈ రకంగా ఫలితాన్ని ఒప్పుకుని ఈసారి ప్రేక్షకుల ఆభిరుచికి తగ్గట్టు సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పడంతో చాలామంది చరణ్ ను ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ లేఖకు విపరీత అర్థాలు తీస్తూ అలా ఎందుకు రాశాడు? ఇలా ఎందుకు రాశాడు?.. అసలు ఎందుకు రాశాడు? ఆయన పేరు ఎందుకు లేదు? ఇలా కోడి గుడ్డుపై ఈకలు పీకడం మొదలు పెట్టారు కొందరు తెలివైన జనాలు.
అలాంటి ఈకలలో మొదటిది.. "లెటర్ ఇప్పుడే ఎందుకు?" దీనికి ఏం సమాధానం చెప్పాలి? సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో రోజు ఈ లేఖ రాసి జనాలను సినిమా చూడడానికి రావద్దు అని చెప్పాలా? అలా చేస్తే సినిమాపై డబ్బు పెట్టిన వారికి నష్టం కదా? ఒకవేళ సినిమా రిలీజ్ అయిన పదేళ్ళ తర్వాత రాస్తే.. 'దొంగలు పడిన ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టుగా ఉందని' ఈ జనాలే విమర్శిస్తారు. సినిమా ఫుల్ రన్ పూర్తయింది కాబట్టి ఇది లేఖ రాసేందుకు పర్ఫెక్ట్ టైమింగ్.
ఇక లేఖ ఎందుకు 'ఆరెంజ్' కు రాయలేదు? 'బ్రూస్ లీ' కి రాయలేదు? అని మరో ఈక. చరణ్ ఎప్పుడు లేఖ రాయాలో.. ఏ సినిమాకు రాయాలో.. ఏ సినిమాకు రాయకూడదో ఈ జనాల దగ్గర.. లేకపోతే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? తనకు అనిపించింది.. రాశాడు. తప్పేమీ లేదు.
ఇక బోయపాటి శ్రీను పేరు ఎందుకు ప్రస్తావించలేదు? ఇది మరో ఈక. టెక్నిషియన్స్ అనే పదంలో అందరూ వస్తారు. దర్శకుడితో సహా. అయినా ప్రేక్షకుల్లో.. ఫ్యాన్స్ లో బోయపాటి సినిమాను చెడగొట్టాడనే అభిప్రాయం ఉంది.. ఈ సమయంలో మళ్ళీ ప్రత్యేకంగా ఆయన పేరు ప్రస్తావించి జనాలను ఇబ్బంది పెట్టడం ఎందుకని అయన పేరు మెన్షన్ చేయలేదేమో.
ఓవరాల్ గా లెటర్లో తప్పులేవీ లేవు.. అంతకు మించి తప్పుపట్టడానికి ఏదీ లేదు.. తెలుగు లేఖలో కొన్ని అక్షర దోషాలు తప్ప. 'కృతజ్ఞుడనై' బదులుగా 'కృతజన్యుడనై' లాంటివి.. అవి తప్ప మిగతావన్ని ప్రస్తావిస్తున్నారు చాలామంది మేథావులు. అయినా చరణ్ లేఖ పై ఈకలు పీకే బదులు ప్రేక్షకులకు జవాబుదారిగా ఉండేలా ఇప్పుడు చరణ్ చేసినట్టు ఇతర హీరోలను కూడా ఇలా చేయమని కోరొచ్చుగా?