Begin typing your search above and press return to search.
#ChaiSam : ఈ టైమ్ లో నీ సోది ఏంటి బ్రో
By: Tupaki Desk | 3 Oct 2021 4:15 AM GMTఅక్కినేని నాగచైతన్య సమంతలు విడిపోయారు. గత మూడు నాలుగు నెలలుగా ఈ విషయమై ప్రచారం జరుగుతోంది. సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ లో అక్కినేని పేరును తొలగించినప్పటి నుండే ఈ చర్చ మొదలు అయ్యింది. ఎట్టకేలకు ఇద్దరు కూడా తాము విడాకులు తీసుకుంటున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇద్దరం చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని... ఈ విషయాన్ని మా వ్యక్తిగత విషయంగా భావించి మీడియా మరియు అభిమానులు ఇతరులు అంతా కూడా మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు. కాని అభిమానులు ఊరుకోరు కదా.. కలిసి ఉంటే బాగుండేది.. విడిపోయినందుకు విచారంగా ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ లు పెడుతున్నారు. ఈ సమయంలో వర్మ వంటి తేడా రాయుళ్లు మాత్రం మంచే జరిగిందిలే.. ఫీల్ అవ్వాల్సిన పని లేదు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఒక్కరు ఇద్దరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సమయంలో వేరే టాపిక్ గురించి చేసిన ట్వీట్స్ కూడా పేరు పెట్టకుండా చేస్తే ఖచ్చితంగా సమంత నాగచైతన్యల గురించే అనే అనుమానం కలుగుతుంది. అందులో భాగంగానే హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది. మోసం చేసిన వారు ఎప్పుడు కూడా బాగు పడరు అంటూ ట్వీట్ చేశాడు. ఆయన చేసిన ఉద్దేశ్యం ఏంటీ.. ఎవరిని ఉద్దేశించి చేశాడు అనేది అందులో లేదు. కాని ట్రెండింగ్ లో ఈ టాపిక్ ఉన్న సమయంలో ఆయన పేరు ఊరు లేకుండా ఈ ట్వీట్ చేయడంను అంతా తప్పుబడుతున్నారు. బుద్ది లేకుండా ఈ సమయంలో ఈ ట్వీట్స్ ఏంటీ అన్నట్లుగా ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. సామ్ చైతూ కలిసి ఉండాలని కోరుకునే వారు.. విడాకుల వార్తతో బాధపడుతున్న వారు సిద్దార్థ్ ట్వీట్ పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
సిద్దార్థ్ చేసిన ట్వీట్ కు పూనమ్ కౌర్ స్పందిస్తూ మీరు చెప్పింది నిజమే అంటూ రీ ట్వీట్ చేసింది. దాంతో ఇద్దరిని కూడా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. సంసారాలు కూలిపోతుంటే ఇలాంటి ట్వీట్స్ ఏంట్రా బాబు.. మీ సోదిలో చర్చకు ఇంతకు మించిన సందర్బం దొరకలేదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిద్దార్థ్ విషయంలో చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. సిద్దార్థ్ అటెన్షన్ సృష్టించేందుకు తనను అందరు పట్టించుకునేందుకు ఇలాంటి ట్వీట్స్ ఈ సమయంలో చేస్తున్నాడు అంటూ కొందరు అతడిని తిడుతున్నారు. మొత్తానికి ఈ సమయంలో సిద్దార్థ్ ట్వీట్ ను ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. వారి విడాకులకు విచారం వ్యక్తం చేయక పోయినా పర్వాలేదు ఇతరులు ఫీల్ అవుతున్న సమయంలో ఇలాంటి చెత్త సోది ట్వీట్స్ వద్దని అతడిని నెటిజన్స్ కోరుతున్నారు.