Begin typing your search above and press return to search.
తెలివి తక్కువ పని చేసిన కీర్తి సురేష్.. నెటిజన్లు చురకలు
By: Tupaki Desk | 11 July 2022 4:30 PM GMTకీర్తి సురేష్.. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మ `గీతాంజలి` అనే మూవీతో హీరోయిన్ గా మారింది. `నేను శైలజ`తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి.. `మహానటి`తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. `మహానటి` తర్వాత అందరూ ఊహించినట్టుగానే కీర్తి సురేష్ దశ తిరిగింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు స్టార్ హీరోల సినిమాల నుండి వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంది.
కానీ, ఏం లాభం.. ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. గత కొంత కాలం నుండీ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న కీర్తి సురేష్.. ఫైనల్ గా ఇటీవల విడుదలైన `సర్కారు వారి పాట`తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ప్రస్తుతం ఈమె తెలుగులో చిరంజీవికి సోదరిగా `భోళా శంకర్`, నానికి జోడీగా `దసరా` చిత్రాలు చేస్తోంది. అలాగే మలయాళ, తమిళ్ భాషల్లోనూ పలు ప్రాజెక్ట్స్ టేకప్ చేసింది.
ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం `పొన్నియిన్ సెల్వన్`. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్ల పై హై బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది.
ఒకప్పుడు తమిళనాడు సహా పలు ప్రాంతాలను ఏలిన చోళ రాజుల కథతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తి, త్రిష, జయం రవి, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, ప్రభు తదితరులు నటిస్తున్నారు. సెప్టెంబర్ 30న ఈ మూవీ తొలి భాగం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
అయితే భారీ అంచనాలు ఉన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుండి కీర్తి సురేష్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చిందట. కానీ, ఆమె ఆ ఆఫర్ ను చేతులారా వదులుకుందట. ఆ సమయంలో ఆమె సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చెల్లెలిగా `అన్నాత్తే(తెలుగులో పెద్దన్న)` చిత్రంలో నటిస్తుందట. రజనీకాంత్ తో నటిస్తే మంచి క్రేజ్ వస్తుందని భావించి.. తనకు డేట్స్ అడ్జస్ట్ కావడం లేదనే కారణంతో కీర్తి `పొన్నియిన్ సెల్వన్`కు నో చెప్పిందట.
దాంతో మణిరత్నం టీమ్ కీర్తి సురేష్ స్థానంలో త్రిషను ఎంపిక చేశారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ చేసిన పనికి ఆమె అభిమానులు తెగ బాధపడుతున్నారు. మరోవైపు `పెద్దన్న` వంటి ఫ్లాప్ మూవీ కోసం `పొన్నియిన్ సెల్వన్`ను వదులుకుని కీర్తి సురేష్ తెలివి తక్కువ పని చేసిందంటూ నెటిజన్లు చురకలు వేస్తున్నారు.