Begin typing your search above and press return to search.
మంచు విష్ణు డౌటనుమానం.. రాత్రి కర్ఫ్యూలపై కౌంటర్..!
By: Tupaki Desk | 10 April 2021 6:30 AM GMTదేశంలో కరోనా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ రెట్టింపు వేగంతో దూసుకొస్తోంది. ఈ దెబ్బకు కేంద్రంతోపాటు రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. కరోనా నియంత్రణకు కొత్త మార్గదర్శకాలను ప్రకటించాయి. పలు రాష్ట్రాలు కఠిన చర్యలకు ఆదేశించగా.. కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.
అయితే.. తొలి దశనుంచీ కరోనా ప్రభావం తగ్గని మహారాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా లాక్ డౌన్ చర్యలు కూడా చేపట్టింది. వీకెండ్ లో అన్నీ మూసేయాలని సీఎం ఆదేశించారు. ఇక, రాత్రిపూట కర్ఫ్యూ కూడా అమల్లోకి వచ్చింది. పలు రాష్ట్రాలు కూడా రాత్రి కర్ఫ్యూ చేపడుతున్నట్టు ప్రకటించాయి.
ఈ అంశంపై ధర్మసందేహం వ్యక్తం చేశాడు సినీహీరో మంచు విష్ణు. ఈమరకు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘‘ కోవిడ్ కారణంగా చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించాయి. అయితే.. కొవిడ్ కేవలం రాత్రిళ్లు మాత్రమే వ్యాపిస్తుందా?’’ అనిప్రశ్నించారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఫినిష్ చేశారు.
ఇప్పుడు ఈ పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది. నిజానికి ఇది చాలా మందికి వచ్చే సందేహమే. జనమంతా పగటిపూట తిరిగి, రాత్రి పడుకుంటారు కదా.. రాత్రి కర్ఫ్యూ వల్ల ఉపయోగం ఏంటీ అన్నది వారి సందేహం. డే టైమ్ లో పనుల కోసం బయటకు వెళ్లే వారివల్ల స్ప్రెడ్ అవుతుంది తప్ప, రాత్రిపూట కరోనా ఎలా విస్తరిస్తుందన్నది వారి ధర్మసందేహం. దీనికి రాష్ట్రాలు ఏం చెబుతాయో?