Begin typing your search above and press return to search.
'హిరణ్యకశ్యప' ఆర్‌ఆర్‌ఆర్ కంటే భారీగా ఉంటుందా?
By: Tupaki Desk | 14 Oct 2020 2:30 PM GMTగుణశేఖర్ దర్శకత్వంలో సినిమా వచ్చి అయిదు సంవత్సరాలు పూర్తి అవుతుంది. 2015లో రుద్రమదేవి సినిమా వచ్చింది. మళ్లీ అప్పటి నుండి సినిమా ఆయన నుండి రాలేదు. ఈ అయిదు సంవత్సరాల కాలంలో ఆయన మొదట ప్రతాప రుద్రుడు చేయబోతున్నట్లుగా ప్రచారం చేశాడు. ఆ తర్వాత గత మూడు సంవత్సరాలుగా రానాతో హిరణ్యకశ్యప సినిమాను చేస్తున్నట్లుగా చెబుతూ వచ్చాడు. గుణశేఖర్ కూడా హిరణ్య కశ్యప సినిమాను చేస్తున్నట్లుగా చెప్పడంతో గుణశేఖర్ హిరణ్యకశ్యప సినిమాపై చాలా నమ్మకం పెట్టుకుని ప్రేక్షకులు ఎదురు చూశారు. కాని ఆ సినిమాను పక్కకు పెట్టి శాకుంతలం సినిమాను తీస్తున్నట్లుగా గుణశేఖర్ ప్రకటించాడు.
శాకుంతలం ప్రకటించిన సమయంలోనే ఆయన హిరణ్యకశ్యప సినిమాను వదిలేయడం లేదు అంటూ హింట్ ఇచ్చాడు. అయినా కూడా చాలా మంది చాలా రకాలుగా హిరణ్య కశ్యప సినిమాను వదిలేశారు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హిరణ్యకశ్యప సినిమా స్క్రీప్ట్ పూర్తి చేశాను. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు లొకేషన్స్ ఎంపిక పూర్తి అయ్యింది. కాని కరోనా కారణంగా సినిమా షూటింగ్ చేయలేక పోతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ సినిమాలను తెరకెక్కించడం సాధ్యం అయ్యే పరిస్థితి లేదని అందుకే హిరణ్య కశ్యప సినిమాను ప్రస్తుతానికి పక్కకు పెట్టినట్లుగా ఆయన చెప్పాడు.
హిరణ్య కశ్యప సినిమా షూటింగ్ కు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని భారీ సినిమా అవ్వడం వల్ల ఇప్పుడు చేయలేక పోతున్నాము అంటూ గుణశేఖర్ చేసిన వ్యాఖ్యలను కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వంటి భారీ సినిమాతో పాటు ఇంకా ఎన్నో సినిమాలు కూడా షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. ఇలాంటి సమయంలో హిరణ్య కశ్యప సినిమా ను షూటింగ్ మొదలు పెట్టక పోవడానికి కారణం కరోనా అంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.
భారీ సినిమాలు సైతం చిత్రీకరణ జరుగుతున్న ఈ సమయంలో హిరణ్య కశ్యపను కూడా షూట్ చేయవచ్చు. కాని ఇతర మరేవో కారణాల వల్ల హిరణ్య కశ్యపను ఆపేశారు అంటున్నారు. మళ్లీ హిరణ్య కశ్యప ఉంటుందా అనేది కూడా క్లారిటీ లేదని కొందరు.. ప్రతాపరుద్రుడు మాదిరిగానే హిరణ్యకశ్యపుడు అంటూ ఇంకొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.