Begin typing your search above and press return to search.
పద్మశ్రీని వదలని కంగన.. నెటిజనుల ఎటాక్
By: Tupaki Desk | 10 Nov 2021 11:32 AM GMTనిత్యం వివాదాలతో చెలిమి చేయడం బాలీవుడ్ నటి కంగన రనౌత్ ప్రత్యేకత. టాపిక్ ఏదైనా తనదైన శైలిలో స్పందించి వివాదాలకు కారణమవుతోంది. కంగన మాటల్లో నిజం దాగి ఉన్నా..విధానం కఠువుగా ఉంటడం నెగిటివ్ పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది. తాను ఒకటి తలిస్తే మరొకటి జరుగుతుంటుంది. ఇటీవలే ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్న సందర్భంగా కంగన తనదైన శైలిలో చెలరేగింది. కంగన స్పీచ్ వివాదాస్పదంగా మారింది. దేశ శత్రువులపై తాను చేసిన పోరాటాన్ని భారత ప్రభుత్వం గుర్తించినందుకు గర్వంగా ఉంది అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది కంగన.
అందులో జిహాదీలు.. ఖలిస్తానీలు అంటూ కొన్ని వివాదాస్పద పదాలను పలకడంతో కంగనపై నెటి జనులు ఎటాక్ కి దిగారు. క్వీన్ ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు. ద్వేషపూరిత ప్రసంగాలు ఇచ్చే కంగనకు పద్మశ్రీ రావడం విచిత్రంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. కంగన కామెంట్లతో పద్మ శ్రీ విలువ తగ్గిందటూ ఓ నెటి జన్ కామెంట్ చేసాడు. ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్ గా మారింది. దీనికి ఎక్కువ లైక్ లు రావడం గమనార్హం. అంటే ఈ విషయంలో కంగనని వ్యతిరేకించే వాళ్లే ఎక్కువగా ఉన్నారని అర్థముతోంది. మరి వీటిపై కంగన వివరణ ఇస్తుందా లేదా? అన్నది చూడాలి.
ఇటీవలే మహరాష్ట్ర ప్రభుత్వంపై కంగన నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకుంటున్నా మహరాష్ట్రకి మాత్రం ముసలం వదల్లేదంటూ ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఉద్దేశించి మండిపడింది. దీనికి ప్రభుత్వ పెద్దలు రిప్లై ఇవ్వలేదు గానీ...ఠాక్రే అనుచరులు మాత్రం విరుచుకుపడ్డారు. కరోనా తో జనాలు కనురమరుగైపోతుంటే?....తన సినిమా రిలీజ్ అవుతుందని థియేటర్లు తెరవాలా? అంటూ మండిపడ్డారు. ఇక కంగన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం `ధాకడ్`..`తేజస్`..`టికు వెడ్స్ షేర్` చిత్రాల్లో నటిస్తోంది.