Begin typing your search above and press return to search.

నిశ్శబ్దంగా ఉండటమే మంచిది అంటున్నారే...!

By:  Tupaki Desk   |   3 Oct 2020 2:30 AM GMT
నిశ్శబ్దంగా ఉండటమే మంచిది అంటున్నారే...!
X
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ''నిశ్శబ్దం''. 'భాగమతి' వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన చాలా గ్యాప్ తీసుకొని పూర్తి స్థాయి సినిమాలో నటించింది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల‌ మరియు కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. ఆర్. మాధవన్ - అంజలి - షాలిని పాండే ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కరోనా కారణంగా థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో అనేక వాయిదాల తర్వాత 'నిశ్శబ్దం' చిత్రాన్ని అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో అక్టోబర్ 1 రాత్రి ప్రీమియర్ గా తెలుగు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబడింది.

అయితే 'నిశ్శబ్దం' సినిమా మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న స్వీటీ ఫ్యాన్స్ సైతం పెదవి విరుస్తున్నారు. అన్ని వర్గాల ఓటీటీ ఆడియన్స్ నుంచి విశ్లేషకుల నుంచి ఈ చిత్రానికి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో 'నిశ్శబ్దం' సినిమాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. 'నిశ్శబ్దం' మూవీ గురించి మాట్లాడటం కంటే నిశ్శబ్దంగా ఉండటమే మంచిదని.. 'నిశ్శబ్దం' సినిమాకి కొన్ని నిమిషాలు నిశ్శబ్దం పాటిద్దామని.. ఇలా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. అనుష్క - మాధవన్ వంటి స్టార్స్ ని పెట్టుకొని అలాంటి సినిమా ఎలా తీసారని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రం థియేటర్లలో విడుదల చేయకపోవడమే మంచిదని.. థ్రిల్లర్ సినిమాని థ్రిల్లింగ్‌ గా కాకుండా బోరింగ్‌ గా తీసారని ట్రోల్ చేస్తున్నారు.