Begin typing your search above and press return to search.
సర్కారు వారి 'పాటలు' రెడీ చేసిన థమన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!
By: Tupaki Desk | 22 Oct 2021 1:18 PMసూపర్ స్టార్ మహేష్ బాబు - పరశురామ్ పెట్లా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''సర్కారు వారి పాట''. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కు గతంలో 'దూకుడు' 'బిజినెస్ మ్యాన్' 'ఆగడు' వంటి చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించారు థమన్. అందుకే దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత సంగీతం అందిస్తున్న సర్కారు వారి పాటల పై ఫ్యాన్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు.
అయితే శుక్రవారంతో 'సర్కారు వారి పాట' మూవీ మ్యూజిక్ కంపోజిషన్స్ పూర్తి చేశారు తమన్. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా సంగీత దర్శకుడు వెల్లడించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబుతో కలిసి దిగిన ఓ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతకముందు ఈ సినిమాలోని సాంగ్ కంపోజిషన్ కి సంబంధించి ఓ వీడియో పంచుకున్నారు. రిథమ్ గాడ్.. ముందుగా టెంప్లెట్స్ సెట్ చేస్తున్నానంటూ థమన్ ఇందులో కీ బోర్డ్ మీద రిథమ్స్ ప్లే చేస్తూ కనిపించారు.
మామూలుగా తమన్ నుంచి ఏదైనా సాంగ్ వస్తుందంటే.. అది కాపీ ట్యూన్ అంటూ నెటిజన్స్ ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. దాని ఒరిజినల్ వెర్సన్ ఇదేనంటూ లింక్ పోస్ట్ చేసి కామెంట్స్ పెడుతుంటారు. ఇప్పుడు 'సర్కారు వారి పాట' రిథమ్ కూడా కాపీయే అని అంటున్నారు. మరీ దారుణంగా ఈసారి ఓ పోర్న్ సైట్ లోని ట్యూన్ ని థమన్ లేపేసారని ట్రోల్ చేయడం మొదలుపెట్టేసారు. మరికొందరు మాత్రం ఇది 'రేసుగుర్రం' సినిమాలోని 'గలగల' సాంగ్ ట్యూన్ అని కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉండగా 'సర్కారు వారి పాట' సినిమాకు థమన్ అందించిన సంగీతం పట్ల డైరెక్టర్ పరశురామ్ హ్యాపీగా లేరంటూ వచ్చిన ఓ ఆర్టికల్ పై ఆయన స్పందించారు. వెరీ గుడ్ ట్రాకింగ్ అంటూ తనదైన స్టైల్ లో ఓ మీమ్ ద్వారా కౌంటర్ ఇచ్చాడు తమన్. ట్రోల్ చేస్తున్న వారికి థమన్ రాబోయే రోజుల్లో తన మ్యూజిక్ తోనే సమాధానం ఇస్తారని అభిమానులు నమ్ముతున్నారు.
కాగా, 2022 సంక్రాంతి బరిలో ఎస్ఎస్ థమన్ తన సినిమాతో తానే పోటీ పడబోతున్నాడు. అదెలా అంటే ఆయన సంగీతం సమకూరుస్తున్న రెండు సినిమాలు అదే సీజన్ లో రిలీజ్ అవుతున్నాయి. జనవరి 12న పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'భీమ్లా నాయక్' మూవీ విడుదల కాబోతోంది. ఇదే క్రమంలో మహేష్ బాబు నటించే 'సర్కారు వారి పాట' జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒకరోజు గ్యాప్ తో రాబోతున్న ఈ రెండు సినిమాల మ్యూజిక్ లో థమన్ ఎలాంటి వెరీయేషన్ చూపిస్తారు? రెండు సినిమాలనూ మ్యూజికల్ హిట్స్ చేసి తన ఫార్మ్ ని కొనసాగిస్తారా? అనేది చూడాలి.