Begin typing your search above and press return to search.
ఊర్మిళ దాని మీద ఎందుకు రియాక్ట్ అవుతోంది...?
By: Tupaki Desk | 18 Sep 2020 8:30 AM GMTహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ ను కుదిపేస్తోంది. డ్రగ్స్ రాకెట్ పై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ డ్రగ్ మాఫియాపై హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో దాదాపు 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని.. డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని.. నీళ్లలా డ్రగ్స్ ప్రవహిస్తుందని కంగనా కామెంట్స్ చేసింది. అయితే కంగనా రనౌత్ బాలీవుడ్ పై తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో సీనియర్ హీరోయిన్ ఊర్మిళ ఈ ఇష్యూలో జోక్యం చేసుకుని 'ఈ డ్రగ్స్ సమస్య దేశం మొత్తం ఉంది. మాదక ద్రవ్యాలకు తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కేంద్ర బిందువు అని కంగనాకు తెలుసా? తన సొంత రాష్ట్రం గురించి కంగన ముందు ఆలోచించాల'ని వ్యాఖ్యానించింది. అయితే సుశాంత్ సూసైడ్ కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంపై కంగనాకు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వార్ జరుగుతున్నప్పుడు ఊర్మిళ అనవసరంగా కలుగజేసుకుందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం గురించి ఊర్మిళ మాట్లాడుతూ కంగనా గురించి కూడా రియాక్ట్ అయి నెటిజన్స్ కు టార్గెట్ అయిందని కామెంట్స్ వస్తున్నాయి. బాలీవుడ్ అవుట్ డేటెడ్ హీరోయిన్ తనని ఎవరు పట్టించుకోవడం లేదని.. అటెన్షన్ కోసమే ఈ ఇష్యూపై రియాక్ట్ అయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఈ సీనియర్ బ్యూటీ కూడా ఈ వ్యవహారంలో ఉందేమో అందుకే రియాక్ట్ అయిందని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ రియా చక్రవర్తి ఎవరెవరి పేర్లు చెప్తుందో అందరూ కలవరపెడుతున్న సమయంలో బాలీవుడ్ అంతా సైలెన్స్ మైంటైన్ చేస్తూ వస్తుంటే ఊర్మిళ దీనిపై స్పందించి అనవసరంగా నెటిజన్ల కామెంట్స్ కు బలైందని అంటున్నారు. మరోవైపు ఊర్మిళ వ్యాఖ్యలపై స్పందించిన కంగనా ఆమెను 'స్టాఫ్ట్ పోర్న్ స్టార్' గా అభివర్ణించింది. కంగనా ఓ నేషనల్ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ 'ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్ స్టార్.. ఈ మాట కఠినంగా ఉండొచ్చు.. కానీ అదే నిజం. ఆమె గొప్ప నటి అని ఎప్పుడూ నిరూపించుకోలేదు. సాఫ్ట్ పోర్న్ తరహా పాత్రలు చేయడం తప్ప ఆమె చేసిందేముంది. ఆమె రాజకీయాల్లోకి రాగా లేనిది - నేను వస్తే తప్పేముంది'' అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కంగన వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఫైర్ అయ్యారు.
ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ కేసును సీరియస్ గా తీసుకొని ఈ కేసులో ఎంత పెద్ద తలకాయలు ఉన్నా వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అందరూ కోరుతున్నారు. సినీ ఇండస్ట్రీతో పాటు దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తున్న డ్రగ్స్ మాఫియాను కూకటి వేళ్ళతో పెకిలించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా శత్రుదేశాల నుండి మన దేశానికి మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో దీనిపై కఠినంగా వ్యవహరించి వారికి తగిన బుద్ధి చెప్పాలని.. ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారికి సహకరిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.