Begin typing your search above and press return to search.
అఫిసియల్: బ్లాక్ బస్టర్ 'కర్ణన్' రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్..!
By: Tupaki Desk | 30 April 2021 8:33 AM GMTయువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వైవిధ్యమైన సబ్జెక్ట్స్ ఎంపిక చేసుకుంటూ ఇతర హీరోలకు గట్టిపోటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. తమిళంలో హిట్ అయిన 'రాత్ససన్' చిత్రాన్ని తెలుగులో 'రాక్షసుడు' పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ క్రమంలో మరో రెండు రీమేక్స్ ని లైన్ లో పెట్టాడు. పెన్ స్టూడియోస్ బ్యానర్ లో వివి వినాయక్ దర్శకత్వం వహించబోయే 'ఛత్రపతి' రీమేక్ తో బెల్లంకొండ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ఈ సినిమా షూట్ చేయలనుకుంటుండగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగు మొదలుకాలేదు. అయితే ఇప్పుడు తాజాగా మరో రీమేక్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు సాయి శ్రీనివాస్.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'కర్ణన్' సినిమా తెలుగు రీమేక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించనున్నాడు. గత రెండు రోజులుగా 'కర్ణన్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని.. బెల్లంకొండ సురేష్ తన కొడుకు కోసం రీమేక్ రైట్స్ కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వీటిని నిజం చేస్తూ ఈ రీమేక్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇటీవలే విడుదలైన 'కర్ణన్' బాక్సాఫీస్ వద్ద సంచలనాత్మక విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ధనుష్ నటనకు గానూ మరో జాతీయ అవార్డు ఖాయం అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రాన్ని చూసిన బెల్లంకొండ శ్రీనివాస్.. దీన్ని తెలుగులో చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 'ఛత్రపతి' రీమేక్ షూటింగు పూర్తయిన వెంటనే ఈ రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో నటించే తారాగణం మరియు సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.