Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు పిల్ల‌ల మ‌మ్మీ ఆ వేష‌మేంటీ అంటూ ట్రోలింగ్!

By:  Tupaki Desk   |   20 March 2022 1:30 AM GMT
ఇద్ద‌రు పిల్ల‌ల మ‌మ్మీ ఆ వేష‌మేంటీ అంటూ ట్రోలింగ్!
X
ఫిగర్-హగ్గింగ్ బాడీకాన్ డ్రెస్ ని ధరించినందుకు సీనియ‌ర్ హీరోయిన్ కాజోల్ మరోసారి తీవ్ర‌మైన ట్రోలింగ్ కి గుర‌య్యారు. తనను ఎగతాళి చేయడ‌మే గాక అవమానక‌ర రీతిలో ట్రోల్ చేశారు. దానికి కార‌ణం హ‌ద్దులు చెరిపేసిన ఎలివేష‌న్ అని తేలింది. ఇటీవల తాను ధ‌రించే దుస్తుల విష‌యంలో ఆన్ లైన్ లో విపరీతమైన ట్రోలింగ్ కు గురైంది కాజోల్.

అయితే అభిమానులు రక్షించడానికి వచ్చి ట్రోల‌ర్స్ కు ఎదురు తిరిగారు. సన్నిహిత మిత్రుడు కరణ్ జోహార్ నిర్వహించిన అపూర్వ మెహతా 50వ పుట్టినరోజు వేడుకలో కాజోల్ ఆఫ్ షోల్డర్ డ్రెస్ లో హగ్గింగ్ స్టైల్లో కనిపించింది. ఆమె క్యాట్ వాక్ కిక్ పెంచింది. కానీ త‌న‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. కొంతమంది ట్రోలింగ్ లో ఆమె గర్భవతి అయి ఉండవచ్చని పేర్కొంటూ అలాంటి బిగుతుగా ఉన్న దుస్తులు ఎందుకు ధరించారు? అని ప్ర‌శ్నించారు.

కానీ అభిమానులు ఇంత‌లోనే తేరుకుని రివ‌ర్స్ లో తిట్టేసారు. “ప్రజలారా.. ఆమె గర్భవతి అని నేను అనుకోను. ఇద్దరు పిల్లల తర్వాత నా పొట్ట కూడా అలానే ఉంటుంది. నేను గర్భవతినా అని ఆడవారు ఎప్పుడూ నన్ను అడిగినప్పుడు నేను నిజంగా ద్వేషిస్తాను. తీవ్రమైన అవమానమిది! ” అని ఒక అభిమాని డిపెండ్ చేశారు.

“అబ్బాయిలు దయచేసి ఆమెను ఊపిరి పీల్చుకోనివ్వండి... నేను ఆమె అభిమానిని కాదు.. కానీ ఆమె వయస్సును చూస్తుంటే చాలా సహజంగా కనిపించింది… ఇద్దరు పిల్లల తల్లి… ఆమె చాలా హాట్ అని నాకు ఖచ్చితంగా తెలుసు…” అని ఒక‌రు పొగిడేశారు. చాలా మంది ఆమెను రాణి అని ప్రశంసించారు. అందంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కాజోల్ తదుపరి రేవతి దర్శకత్వంలో నటించనుంది. సౌత్ లో మునుముందు న‌టించే ఆలోచ‌న‌లో లేదు.