Begin typing your search above and press return to search.

ప్ర‌కాశ్ రాజ్‌పై ట్రోల్స్‌.. ఓ రేంజ్‌లో నెటిజ‌న్ల కామెంట్లు

By:  Tupaki Desk   |   12 Oct 2021 5:40 AM GMT
ప్ర‌కాశ్ రాజ్‌పై ట్రోల్స్‌.. ఓ రేంజ్‌లో నెటిజ‌న్ల కామెంట్లు
X
బ‌హుభాషా న‌టుడు.. ఫైర్ బ్రాండ్‌.. ప్ర‌కాశ్ రాజ్‌పై నెటిజ‌న్లు కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. అటు రాజ‌కీయాల్లోనూ.. ఇటు మూవీ ఆర్టిస్ట్స్ అసోయేష‌న్‌లోనూ.. ఆయ‌నకు వ‌రుస ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో.. ఆయ‌న క‌ర్ణాట‌క నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీనికి ముందు న‌రేం ద్ర మోడీపైనా.. హిందూత్వ విధానాలు. గోవ‌ధ వంటి అనేక సున్నిత విష‌యాల‌పై ప్ర‌కాశ్ రాజ్ మాట్లాడా రు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పొలిటిక‌ల్ వివాదాలు కొన‌సాగాయి. ఇక‌, తాజాగా మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా బ‌రిలో నిలిచిన ఆయ‌న 100 ఓట్ల పైచిలుకు తేడాతో ఓడిపోయారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాశ్ రాజ్‌ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కళాకారుడిగా త‌న‌కంటూ ఆత్మగౌర వం ఉంటుంద‌ని, అందువల్ల, ‘మా’ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నానని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశా రు. అయితే, తెలుగు సినిమాల్లో నటిస్తాన‌ని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. విజయం సాధించిన విష్ణు ప్యానెల్‌కు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఎలా ఓడిపోయాం? ఎలా గెలిచాం? అన్నది ముఖ్యం కాదు. ‘మా’కు తెలుగువారే నాయకత్వం వహించాలన్నారు. నేను తెలుగు వ్యక్తిని కాదన్నారు. ప్రాంతీయత, జాతీయవా దం... వీటన్నిటి నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి`` అని చెప్పుకొచ్చారు.

``బండి సంజయ్‌ లాంటి వాళ్లు ట్వీట్‌ చేశారు. తెలుగోడు కానివాడు ఓటు వేయొచ్చు కానీ, పోటీ చేయకూ డదనే విధంగా బైలాస్‌ మార్చాలనే నినాదం ప్రారంభించారు. మీరొచ్చిన తర్వాత బైలాస్‌ మారుస్తామన్నా రు. ఏం చేయను? నా తల్లితండ్రులు తెలుగోళ్లు కాదు. అది నా తప్పు కాదు, వాళ్ల తప్పు కూడా కాదు. మోహన్‌బాబు, కోట, రవిబాబు వంటివారు ‘అతిథిగా వస్తే, అతిథిగా ఉండాలి’ అని చెప్పారు. ఇటువంటి ఎజెండా ఉన్నవాళ్ల దగ్గర నేను ఉండలేను. అందుకని, రాజీనామా చేస్తున్నా’’ అని తెలిపారు. అసలు ఆట ఇప్పుడు మొదలైందన్నారు.

అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పైనే నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా కామెంట్స్‌, ట్రోల్స్ చేస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్‌.. విజ యం సాధించి ఉంటే కూడా ఇలానే వ్యాఖ్య‌లు చేసే వారా? అని ప్ర‌శ్నించారు. కొంద‌రు.. ప్ర‌కాశ్ రాజ్ అహం దెబ్బ‌తింద‌ని.. అందుకే రిజైన్ చేశార‌ని.. ఇక‌పై ఆయ‌న మాలో ఆయ‌న పాత్ర ఉండ‌ద‌ని వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. ఆయ‌న ప్ర‌చారం స‌మ‌యంలోను.. మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల స‌మ‌యంలో ను.. గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండా.. తాను ఆర్టిస్టుల‌కు సేవ చేస్తాన‌ని.. స‌హాయం చేస్తాన‌ని చెప్పిన మాట‌లు ఏమ‌య్యాయ‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

అంతేనా.. ఓడిపోయినంత మాత్రాన‌.. ఆయ‌న మాకు ఎందుకు దూరం కావాలి.. విష్ణుతో క‌లిసిప‌నిచేయొ చ్చు క‌దా? అనే ప్ర‌శ్న‌లు కూడా నెటిజ‌న్ల నుంచి వ‌స్తున్నాయి. అంతేకాదు.. కేవ‌లం త‌న కోపంతోనే.. ఇలా చేస్తున్నార‌ని.. నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.