Begin typing your search above and press return to search.

పాపం థమన్ కే ఎందుకు ఇలా జరుగుతుంది?

By:  Tupaki Desk   |   9 May 2022 8:00 AM IST
పాపం థమన్ కే ఎందుకు ఇలా జరుగుతుంది?
X
ప్రస్తుతం టాలీవుడ్ టాప్‌ మ్యూజిక్‌ కంపోజర్ థమన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవి శ్రీ ప్రసాద్‌ తో దాదాపు సమానమైన స్టార్‌ డమ్ ను దక్కించుకున్నాడు. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు.. ఎక్కువ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్‌ ను ఇచ్చిన ఘనత కూడా థమన్‌ కు దక్కుతుంది. అలాంటి థమన్‌ సక్సెస్ లనే కాకుండా ట్రోల్స్ ను కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది.

థమన్ గత కొన్నాళ్లుగా చేస్తున్న ప్రతి సినిమాలోని ఏదో ఒక పాటను కాపీ అంటూ విమర్శలు చేసే వారు ఎక్కువ అయ్యారు. సోషల్‌ మీడియాలో థమన్ మ్యూజిక్ ను రెగ్యులర్ గా విమర్శించేందుకు ఒక బ్యాచ్‌ రెడీగా ఉంటుంది. ఆ బ్యాచ్ తాజాగా విడుదల అయిన మమ మహేష అనే పాటను ట్రోల్స్ చేస్తూ కాపీ మరక అంటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒక తెలుగు సూపర్‌ హిట్‌ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్‌ కు ఇది కాపీ అంటూ వారు ఆరోపించడంతో పాటు కొన్ని వీడియోలను జత చేసి మీమ్స్ చేస్తున్నారు. పాటల ట్యూన్స్ ఒక్కోసారి కాస్త అయినా మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు కాపీ అంటూ విమర్శించడం ఎంత వరకు కరెక్ట్‌.. పాపం థమన్ నే ఎందుకు ఇలా పదే పదే టార్గెట్‌ చేస్తున్నారు అంటూ థమన్ అభిమానులు వారికి సోషల్‌ మీడియా ద్వారా రివర్స్ కౌంటర్‌ వేయడం మొదలు పెట్టారు.

థమన్‌ సక్సెస్ ను జీర్ణించుకోలేని ఆ కొందరు ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వారు థమన్‌ ఏ పాటలు చేసినా కూడా విమర్శిస్తూనే ఉంటారు. కనుక అలాంటి విమర్శలను థమన్ అభిమానులు కాని మహేష్‌ బాబు అభిమానులు కాని పట్టించుకోనక్కర్లేదు అంటున్నారు. ఖచ్చితంగా మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమాలోని ఆ మాస్ సాంగ్ బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అంటున్నారు.

మమ మహేష్ సాంగ్‌ మాస్ ఆడియన్స్ తో పాటు ప్రతి ఒక్క మహేష్ బాబు అభిమానిని అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. మహేష్‌ బాబు మరియు కీర్తి సురేష్ ల మాస్‌ స్టెప్పులు ఖచ్చితంగా సినిమా స్థాయిని మరింతగా పెంచడం ఖాయం అంటూ థమన్ అభిమానులు ధీమాగా ఉన్నారు.