Begin typing your search above and press return to search.
రౌడీ కాన్ఫిడెన్స్ ఓకే.. తొందరపడ్డాడా?
By: Tupaki Desk | 22 Jun 2021 10:30 AM GMTఎవరి గొప్ప వారు చెప్పుకుంటే ఏం బాగుంటుంది? ఇంత చిన్న లాజిక్ ను రౌడీ ‘వీడీ’ (విజయ్ దేవరకొండ) ఎలా మిస్ అయ్యారన్న విస్మయం వ్యక్తమవుతోంది. విజయ్ దేవరకొండ.. పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతునన లైగర్ మీద ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. కరోనా దెబ్బకు షూటింగ్ ఆపేసినప్పటికీ.. మళ్లీ పట్టాల మీదకు తెచ్చేందుకు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.
ఈ పాన్ ఇండియా మూవీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. థియేటర్ లో కాకుండా ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదలయ్యేందుకు అన్ని భాషల్లో కలిపి రూ.200 కోట్లు ఇచ్చేందుకు ఓటీటీ ఫ్లాట్ ఫాం ఒకటి ఆఫర్ ఇచ్చిందన్న వార్త రావటం.. దానిపై విజయ్ దేవరకొండ ఇట్టే రియాక్టు కావటం తెలిసిందే.
రూ.200 కోట్లు చాలా చిన్న మొత్తమని.. ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని థియేటర్లలో చూస్తారని చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఎవరి సినిమా మీద వారికి ఉండే అంచనాలు వేరుగా ఉంటాయి. పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఊగిపోతున్నప్పుడు.. సినిమా చేస్తున్న విజయ్ మరింత కాన్ఫిడెంట్ గా ఉండటం తప్పేం కాదు.
కాకుంటే.. ఇలాంటి కాన్ఫిడెన్స్ మాటల్ని ఇట్టే వాడేయకూడదు. ఆచితూచి అన్నట్లుగా వాడాలి. అయినా ఎవరి గొప్పలు వారు చెప్పుకుంటే ఏం బాగుంటుంది? మన గొప్పతనం గురించి పక్కనోడు చెబితే మరింత బాగుంటుంది. మరీ.. విషయాన్ని ‘వీడీ’ ఎందుకు మిస్ అయినట్లు చెప్మా? ఆవేశం మంచిదే కానీ.. దానికో లెక్క ఉండాలన్న విషయాన్ని సినీ రౌడీ త్వరగా గుర్తిస్తే మంచిది.