Begin typing your search above and press return to search.

దర్శకేంద్రులు ఇలా బుక్కయ్యారే

By:  Tupaki Desk   |   25 Feb 2019 11:37 AM GMT
దర్శకేంద్రులు ఇలా బుక్కయ్యారే
X
ఒకోసారి ఆవేశంలోనో ఫ్లోలోనో అనే మాటలు కొన్నిసార్లు మనకు తెలియకుండానే చాలా దూరం తీసుకువెళ్తాయి. ఒకప్పుడు దేనికీ ఆధారం ఉండేది కాదు కాని మీడియా ప్లస్ టెక్నాలజీ విస్తృతంగా పెరిగిపోయిన తరుణంలో ఏదైనా అనేటప్పుడు ఒకటికి వందసార్లు ఆలోచించుకోక తప్పదు. అలా చేయకపోవడమే దర్శకుడు రాఘవేంద్ర రావు గారిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణంలో ఉన్నప్పుడు ఈ సినిమాను తాను 12 సార్లు చూస్తానని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు.

ఆయనతో డజను సినిమాలు చేశాను కాబట్టి అన్నిసార్లు చూసి ఋణం తీర్చుకుంటానని ఏదేదో కాస్త గట్టిగానే చెప్పారు. కట్ చేస్తే ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు రెండూ దుకాణం సర్దేశాయి. ఈ ప్రస్తావన తెస్తే నందమూరి ఫ్యాన్స్ మొహం తిప్పేసుకుంటున్నారు. పతి ప్రాణం తప్ప అనే యముడి డైలాగ్ తరహాలో ఈ సినిమా గురించి తప్ప అంటూ తప్పించుకు పోతున్నారు. అవును వసూళ్లు అంత దారుణంగా ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు

ఇప్పుడు నెటిజెన్లకు దర్శకేంద్రుడు ఈ పాయింట్ దగ్గరే దొరికిపోయారు. అప్పుడు శపథం చేసారు కదా మరి ఎన్టీఆర్ రెండు భాగాలు చెరి 12 కలిపి మొత్తం 24 సార్లు చూశారా అంటూ సోషల్ మీడియాలో ట్రాలింగ్ మొదలుపెట్టేసారు. అసలు ఓ రెండు మూడు సార్లు చూడటమే అగ్ని పరీక్ష అనుకుంటే మీరు ఏకంగా 12 సార్లు అంటూ శపథం ఎలా చేసారు సార్ అంటూ మరికొందరు సానుభూతి చూపిస్తున్నారు.

నిజానికి ఆయన అప్పుడు ఆ మాట అనడంలో దురుద్దేశం ఏమి లేదు. అడవి రాముడు లాంటి చరిత్ర సృష్టించిన సినిమా వేటగాడు లాంటి కమర్షియల్ సెన్సేషన్ అన్ని ఎన్టీఆర్ తోనే తీసారు రాఘవేంద్రరావు. ఆ అభిమానంతో ఏదో పన్నెండు సార్లు అంటూ స్లిప్ అయ్యారు కాని నిజంగా అన్నంత పని చేయగలరా. అయినా నేను చూసాను ఆయన అన్నా కూడా ఎవరూ సాక్ష్యాలు అడగలేరుగా. ఇదంతా సోషల్ మీడియాకు ఓ ట్రాలింగ్ టాపిక్ గా మారిందే తప్ప కంక్లూజన్ కు వచ్చేది కాదు