Begin typing your search above and press return to search.
'బ్రహ్మాస్త్ర' ను బాయ్ కాట్ చేయాలంటున్న నెటిజన్స్..!
By: Tupaki Desk | 17 Jun 2022 7:43 AM GMTబాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెకెక్కుతున్న ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇందులో రణ్ బీర్ కపూర్ - అలియాభట్ - అమితాబ్ బచ్చన్ - అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 9న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోన్న ఈ సోషయో ఫాంటసీ అడ్వెంచర్ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. దక్షిణాదిలో ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్న 'బ్రహ్మాస్త్రం' మొదటి భాగం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఐదు భారతీయ భాషల్లో వచ్చిన ఈ ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. దీన్ని పొగిడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో.. ట్రోల్ చేసేవాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ లోని ఓ సీన్ పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
బ్రహ్మాస్త్ర ట్రైలర్ లో రణ్ బీర్ కపూర్ షూ ధరించి గుడిలోకి పరుగెత్తడమే కాదు.. గుడిలో గంటలు కొడతాడు. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. #BycottBrahmastra అనే ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. హిందూ సంప్రదాయాలను కించపరిచే ఇలాంటి సినిమాను ఎవరూ చూడొద్దని కామెంట్స్ చేస్తున్నారు.
దక్షిణాది చిత్రాల్లో హిందూ దేవుళ్లను, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పడానికి కృషి చేస్తుంటే.. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ మాత్రం వాటిని గౌరవించడం లేదంటూ ఫైర్ అవుతున్నారు. 'బాహుబలి' 'RRR' 'అఖండ' వంటి చిత్రాలలో హిందీ దేవుళ్లను గౌరవించేలా సన్నివేశాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
'అఖండ' వంటి సినిమాలో హిందూ దేవుళ్లు - ఆలయాల పరిరక్షణ - దేవాలయాల పవిత్రతను కాపాడటం గురించి గొప్పగా చెప్తుంటే.. 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో మాత్రం హిందువుల మనోభావాలు కించపరిచేలా సీన్లు పెట్టారని మండిపడుతున్నారు. మరి దీనిపై 'బ్రహ్మాస్త్ర' మేకర్స్ స్పందించి వివరణ ఇస్తారేమో చూడాలి.
నిజానికి హిందూ సంప్రదాయాలను కించపరుస్తూ.. వివాదాస్పద సన్నివేశాలతో హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ గతంలో అనేక హిందీ సినిమాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కావాలనే హిందువుల టార్గెట్ చేసి సినిమాలు చేస్తున్నారంటూ అక్కడి ఫిలిం మేకర్స్ పై విమర్శలు చేశారు. ఇప్పుడు లేటెస్టుగా 'బ్రహ్మాస్త్ర' చిత్రంలోని సీన్స్ పై అభ్యంతరాలు రావడం చర్చనీయాంశంగా మారింది.