Begin typing your search above and press return to search.
'రాధే' చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటున్న నెటిజన్స్..!
By: Tupaki Desk | 15 May 2021 4:30 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ''రాధే'' - 'యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'. ప్రభుదేవా దర్శకత్వంలో కొరియన్ చిత్రం ‘ది అవుట్ లాస్’ రీమేక్ గా ఇది తెరకెక్కింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న థియేటర్స్ తో పాటు, డిజిటల్ వేదికల్లో పే పర్ వ్యూ పద్ధతిలో మే14న విడుదల చేశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. డ్రగ్స్ మాఫియాను నడిపే విలన్ ని అడ్డుకునే పోలీస్ ఆఫీసర్ అనే లైన్ తో ఇప్పటికే ఎన్నో సినిమాలు చూసేసిన ఆడియన్స్.. దీని కోసం కొరియన్ చిత్రాన్ని రీమేక్ చేయాల్సిన అవసరం ఏముందని.. అదే బ్యాక్ డ్రాప్ లో ఉండే నాలుగు పాత సౌత్ సినిమాలు చూస్తే సరిపోయేదని కామెంట్స్ చేస్తున్నారు.
అలానే ఏమాత్రం కొత్తదనం లేని 'రాధే' కథను అసలు సల్మాన్ ఎలా ఒప్పుకున్నాడో అని.. 'రాధే' సినిమా చూస్తే మిగిలేది ‘బాధే’ అని అంటున్నారు. టాక్ ఎలా ఉన్నా ఈద్ కావడంతో ఫస్ట్ డే మాత్రం ఈ సినిమా మంచి వ్యూస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే 'రాధే' సినిమాకు నెగిటివ్ టాక్ తో పాటుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ ట్రెండ్ క్రియేట్ అయింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు. ట్విట్టర్ లో #BoycottRadhe హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేశారు. దీనికి ముఖ్య కారణం దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం విషయంలో ప్రజలు ఇంకా కొందరు బాలీవుడ్ ప్రముఖులపై కోపంగా ఉండటమే అని తెలుస్తోంది.
అప్పట్లో సుశాంత్ సింగ్ మరణానికి ఇండస్ట్రీలోని నెపోటిజం మరియు కొందరు వ్యక్తులే కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ 'బాయ్ కాట్ బాలీవుడ్' అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఇప్పుడు 'రాధే' విడుదల సందర్భంగా మరోసారి సుశాంత్ సపోర్టర్స్ బాలీవుడ్ స్టార్స్ పై ఉన్న కోపాన్ని బయట పెడుతున్నారు. అలానే సల్మాన్ ఖాన్ 'రాధే' అనే టైటిల్ ని పెట్టుకున్నదుకు ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని కామెంట్స్ పెడుతున్నారు.