Begin typing your search above and press return to search.

తెలుగులో అందుబాటులో ఉన్న చిత్రాన్ని మళ్ళీ తెలుగులోకి రీమేక్ చేస్తారా..?

By:  Tupaki Desk   |   17 Aug 2021 5:49 AM GMT
తెలుగులో అందుబాటులో ఉన్న చిత్రాన్ని మళ్ళీ తెలుగులోకి రీమేక్ చేస్తారా..?
X
క్రైమ్‌ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. ఆసక్తికర కథ, కథనాలతో చివరి వరకూ ప్రేక్షకుడిలో ఉత్కంఠను కలిగించగలిగితే సినిమా సక్సెస్ అయినట్లే. అందుకే ఇటీవల కాలంలో అనేక క్రైమ్‌ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ వచ్చాయి. ఈ క్రమంలో అలాంటి కథాంశంతో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన ''నెట్రికన్‌'' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'నేట్రికన్‌' సినిమాలో నయన్ ఓ అంధురాలి పాత్రను పోషించింది. అమ్మాయిల‌ను కిడ్నాప్ చేసే ఒక సైకో కిల్ల‌ర్‌ ను వేటాడి, అంతం వధించే అంధురాలి కథ ఇది. సౌత్ కొరియన్‌ క్రైమ్ థ్రిల్లర్‌ ‘బ్లైండ్‌’ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. 'గృహం' ఫేమ్ మిలింద్‌ రౌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌ పై నయన తార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్‌ శివన్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ అయిన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

అయితే ఇప్పుడు 'నేట్రికన్‌' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. నయనతార పోషించిన పాత్రలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించనుందని అంటున్నారు. ఇప్పటికే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ 'నేట్రికన్‌' రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశారని.. త్వరలోనే అన్ని విషయాలను ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే ఓటీటీలో ఆల్రెడీ తెలుగు వెర్షన్ అందుబాటులో ఉండగా.. మళ్ళీ తెలుగులో రీమేక్ చేయడమనేది నమ్మశక్యంగా లేదు.

నయనతార కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని 'నేత్రికాన్' సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంచారు. మరి ఇప్పుడు అదే చిత్రాన్ని మళ్ళీ తెలుగులోకి రీమేక్ చేస్తే ఆడియన్స్ చూస్తారా అనేది ప్రశ్నార్థకమే. కాకపోతే 'లూసిఫర్' సినిమా ఆల్రెడీ అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. 'వీరుడొక్కడే' సినిమా తెలుగులో రిలీజ్ అయిన తర్వాత.. పవన్ కళ్యాణ్ 'కాటమ రాయుడు' అనే పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా 'నేత్రికాన్' చిత్రాన్ని అనుష్క తో రీమేక్ చేస్తారేమో చూడాలి. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.