Begin typing your search above and press return to search.

'ఇలాంటి సినిమా ప్రమోషన్స్ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!'

By:  Tupaki Desk   |   10 Jan 2020 6:41 AM GMT
ఇలాంటి సినిమా ప్రమోషన్స్ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!
X
సినిమాలను ప్రచారం చేయడంలో వెబ్‌ సైట్లను ఉపయోగించుకోవడం గత పదేళ్లలో గణనీయంగా పెరిగింది. ట్రయలర్లు లోడ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ విసుగెత్తించే వెబ్‌ సైట్ల స్థానాన్ని యూట్యూబ్ ఆ తరువాత భర్తీ చేసింది.

ప్రస్తుతం సినిమాల ప్రచారకులు అభిమానులకు సులభంగా - వీలుగా ఉండేలా కుల్ఫీ(kulfy) యాప్ వినియోగిస్తున్నారు. స్టిక్టర్లు - గిఫ్‌ లు వాడుతూ ఇందులో సినిమాల ప్రమోషన్ చేస్తారు.

యూట్యూబ్‌ లో అయితే అభిమానులు ఒకట్రెండు సార్లు ట్రయలర్లు చూస్తారు కానీ అందులో ఉండే కంటెంట్‌ తో ఇంటరాక్ట్ కాలేరు. కానీ, కుల్ఫీ యాప్‌‌ లో అయితే యూజర్లు తమ భావాలను పంచుకుంటూ - చాట్ చేస్తూ - తమకు నచ్చిన నటుల గిఫ్‌ లు - స్టిక్టర్లు జోడిస్తూ పంపించుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న వాట్సాప్ - ఫేస్‌ బుక్ - ట్విటర్ సహా 20,000కు పైగా యాప్‌ లలో తెలుగు గిఫ్‌ లను అందించేలా గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డిసెంబర్‌ లో ‘కుల్ఫీ’ ప్రకటించింది. సినిమా స్టూడియోలు - ఇతర సంస్థలు కుల్ఫీ యొక్క అసలైన సత్తాను గుర్తించి తమ విలువైన వనరులు - సమయాన్ని దీనికి కేటాయిస్తున్నాయి.

సరికొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru GIFs) కోసం వాట్సాప్ - మెసెంజర్ - ట్విట్టర్ - జీ బోర్డ్ వంటి చాట్ ప్లాట్‌ ఫాంలలో గిఫ్‌ లు - స్టిక్కర్లను ఉపయోగిస్తూ ప్రమోట్ చేయడానికి ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్ సంస్థ కుల్ఫీ యాప్‌ తో జత కట్టింది.

ఈ సినిమా ట్రయలర్లలోని కీలక సన్నివేశాలు - డైలాగ్స్ - సాంగ్ లిరిక్స్ షేర్ చేయడానికి గిఫ్‌ లు ఇప్పటికే అందుబాటులోకొచ్చాయి. ‘మన దగ్గర బేరాల్లేవమ్మా’ అంటూ మహేశ్ బాబు - ‘మీకు అర్థమవుతుందా?’ అంటూ హీరోయిన్ రష్మిక చెప్పిన డైలాగులకు సంబంధించిన గిఫ్‌ లు ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి.

కేవలం సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించిన గిఫ్‌ లే కాదు. రానున్న సినిమాలు ‘అలవైకుంఠపురంలో’ వంటివి, ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు - మరెన్నో తెలుగు ట్రెండింగ్ గిఫ్‌ లు కూడా మీకోసం కుల్ఫీలో అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు చాటింగ్ - కామెంట్లలో వాడుతూ ఆనందం పొందొచ్చు.

ఈ కుల్ఫీ యాప్ లాంచ్ చేసిన తరువాత ఇప్పటివరకు 10 కోట్ల గిఫ్‌ లు ఈ వేదిక ద్వారా వాడుకున్నారు, వీటి కోసం 25 కోట్ల సెర్చ్ రిక్వెస్టులు వచ్చాయని కుల్ఫీ సహ వ్యవస్థాపకులు బసంత్ వాలేటి - గిరీశ్ కొల్లూరి చెప్పారు.

ఒక నిర్దిష్ట భావోద్వేగంలోని అనుభూతిని కేవలం 3 నుంచి 5 సెకండ్ల తక్కువ సమయంలోనే గ్రహించడం గిఫ్‌ ల అందం - గొప్పతనమని వారు చెప్పారు. కాబట్టి మీ భావాలను వివరంగా చెప్పాలనుకోవడం కంటే ఒక సరైన గిఫ్‌ ను వాడి సరిగ్గా నప్పేలా సందేశాలను పంపించుకోవచ్చని వారు సూచించారు.

కుల్ఫీ యాప్‌ ను ఇప్పుడే ఫ్రీగా డౌన్‌ లోడ్ చేసుకుని చాట్‌ లలో మీ భావాలను వ్యక్తీకరించుకోండి.

కుల్ఫీ యాప్ డౌన్‌ లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Click here to download the App

వాట్సాప్ మెసేజ్‌ లలో తెలుగు స్టిక్కర్లు వాడడమెలాగో ఈ బ్లాగులో చూడండి: https://kulfyapp.com/blogs/how-to-use-telugu-stickers-in-whatsapp

సరిలేరు నీకెవ్వరు సినిమా పేజ్: https://kulfyapp.com/movie/sarileru-neekevvaru

మరిన్ని విషయాల కోసం ట్విట్టర్ లో ఫాలో అవ్వండి: @kulfyapp

కుల్ఫీ గురించి: కుల్పీ న్యూయార్క్ బేస్డ్ స్టార్టప్. తెలుగు గిఫ్‌ లు - చిన్నచిన్న క్లిప్‌ లు - స్టిక్కర్ల మీ ఫేవరెట్ మెసేజింగ్ - సోషల్ మీడియా వేదికలపై క్షణాల్లో తయారుచేసుకోవడానికి - వెతకడానికి - షేర్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.


Press release by: Indian Clicks, LLC