Begin typing your search above and press return to search.

రాజ‌శేఖ‌ర్ కూతురుతో రాజ్ త‌రుణ్ 'పెళ్ళంట'..!

By:  Tupaki Desk   |   4 April 2022 11:36 AM GMT
రాజ‌శేఖ‌ర్ కూతురుతో రాజ్ త‌రుణ్ పెళ్ళంట..!
X
మంచి టాలెంట్ ఉన్నా.. స‌క్సెస్ లేని టాలీవుడ్ హీరోల్లో రాజ్ త‌రుణ్ ఒక‌డు. `ఉయ్యాల జంపాల` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ త‌రుణ్‌.. ఆ వెంటనే సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్, ఈడోరకం ఆడోరకం వంటి చిత్రాల‌తో మంచి విజ‌యాల‌ను ఖాతాలో వేసుకున్నాడు. కానీ, ఆ త‌ర్వాత ఈయ‌న చేసిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ఇటీవ‌ల రాజ్ త‌రుణ్ `స్టాండప్‌ రాహుల్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు.

సాంటో మోహ‌న్ వీరంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్‌గా మెరిసింది. 2022 మార్చి 18న విడుద‌లైన ఈ సినిమా యావ‌రేజ్ టాక్ సొంతం చేసుకుని నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాల‌ను మిగిల్చింది. మొత్తానికి మ‌రో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్న రాజ్ త‌రుణ్ నెక్స్ట్ స్టెప్ ఏంటా అని సినీ ప్రియులు ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో సీనియ‌ర్ స్టార్ హీరో రాజ‌శేఖ‌ర్ కూతురు శివాని రాజ‌శేఖ‌ర్‌తో పెళ్లికి సిద్ధ‌మ‌య్యాడీయ‌న‌. అయితే రియ‌ల్‌గా కాదండోయ్‌.. రీలే.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తమడ మీడియా మ‌రియు జీ5 సంయుక్తంగా నిర్మించబోయే ఓ వెబ్ సీరీస్ లో రాజ్ తరుణ్ హీరోగా నటించబోతున్నాడు. `ఆహ నా పెళ్ళంట` టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సిరీస్‌కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వ‌హించ‌బోతుండ‌గా.. రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బుర్ర నిర్మాతలుగా ఉన్నారు. తాజాగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైన ఈ సిరీస్‌లో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న శివాని రాజ‌శేఖ‌ర్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. వీరిద్ద‌రి ల‌వ్ ట్రాక్ హైలైట్‌గా నిలుస్తుంద‌ని టాక్ న‌డుస్తోంది.

అలాగే ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. మ‌రి ఈ సిరీస్‌తో అయినా రాజ్ త‌రుణ్ స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతాడో..? లేదో..? చూడాలి. కాగా, శివాని విష‌యానికి వ‌స్తే.. ఈ బ్యూటీ `అద్భుతం` మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2021లో ఓటీటీ వేదిక‌గా రిలీజైన ఈ చిత్రం మంచి విష‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఈమె త‌న తండ్రి రాజ‌శేఖ‌ర్‌తో క‌లిసి `శేఖ‌ర్‌` అనే మూవీలో న‌టిస్తోంది. త‌మిళంలో రెండు సినిమాల‌కు సైతం శివాని సైన్ చేసింది.