Begin typing your search above and press return to search.

శంకర్‌ పెడుతున్న ఖర్చుతో మెగా ఫ్యాన్స్ ఫుల్‌ హ్యపీ

By:  Tupaki Desk   |   4 April 2022 7:39 AM GMT
శంకర్‌ పెడుతున్న ఖర్చుతో మెగా ఫ్యాన్స్ ఫుల్‌ హ్యపీ
X
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెల్సిందే. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ముందే ప్రారంభం అయిన ఆర్ సీ 15 చిత్రం యొక్క షూటింగ్‌ కు సంబంధించిన అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఒక పాట చిత్రీకరణ పూర్తి చేశారట. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌ లో ఈ సినిమాను షూట్‌ చేశారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ పాట కోసం దర్శకుడు శంకర్ దాదాపుగా 9 కోట్లకు పైగా ఖర్చు చేశాడట. ఆ స్థాయి ఖర్చు శంకర్ సినిమాలకు చాలా సాదారణ విషయం. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్ అయిన శంకర్ ప్రస్తుతం అంతకు మించి అన్నట్లుగా ఈ సినిమాను చేస్తున్నాడు. రికార్డు స్థాయి బడ్జెట్‌ తో ఈ సినిమా ను దిల్‌ రాజు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

మొన్న పాట గురించి చర్చ జరిగింది. ఇప్పుడు ఫైట్ కు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఒక ఫైట్‌ సీక్వెన్స్ కు సంబంధించి శంకర్‌ ఏకంగా 10 కోట్లు ఖర్చు చేశాడట. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఉపయోగించకుండా చాలా నాచురలో గా ఉండేందుకు గాను ఫైట్‌ సన్నివేశం కోసం ఆ స్థాయి లో ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

సినిమా గురించి మీడియాలో వస్తున్న ఈ పుకార్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు సినిమాపై అంతకంతకు అన్నట్లుగా అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఈమద్య కాలంలో శంకర్‌ నుండి గొప్ప సినిమాలు రాలేదు. కొన్ని వివాదాలు.. మరి కొన్ని ప్రయోగాల కారణంగా ఆయన నుండి రెగ్యులర్ కమర్షియల్‌ సినిమాలను ఆయన నుండి ప్రేక్షకులు చూడలేక పోయారు.

ఇప్పుడు రామ్ చరణ్‌ తో శంకర్ సినిమా చేస్తున్న నేపథ్యంలో తమిళం మరియు తెలుగు ఆడియన్స్ లో ఖచ్చితంగా అంచనాలు పీక్స్ లో ఉంటాయి. ఏమాత్రం అనుమానం లేకుండా శంకర్‌ ఈ సినిమా కోసం కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టిస్తాడని ఇన్నాళ్లు అంతా అనుకున్నారు. కేవలం ఒక ఫైట్‌ మరియు పాట కోసం 20 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు. కనుక ఖచ్చితంగా శంకర్‌ గట్టిగానే దిల్‌ రాజు తో పెట్టిస్తున్నాడు అంటూ మెగా అభిమానులు ఫుల్‌ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.