Begin typing your search above and press return to search.
తెలుగు ప్రేక్షకుల ముందుకు కొత్త బిగ్ బాస్ రాబోతున్నాడా?
By: Tupaki Desk | 13 Dec 2022 4:30 PM GMTతెలుగు బుల్లి తెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు ఆరు రెగ్యులర్ సీజన్ లు ఒక ఓటీటీ సీజన్ పూర్తి అయ్యాయి. సీజన్ 6 ముగింపు దశకు వచ్చింది. ఈనెల 18న బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఈ సీజన్ తో నాగార్జున బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. నాగార్జున బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి నుండే బిగ్ బాస్ కోసం కొత్త హోస్ట్ ను పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అయిదు సీజన్ లకు నాగార్జున హోస్ట్ గా చేశాడు. నాలుగు రెగ్యులర్ సీజన్ లు మరియు ఒకటి ఓటీటీ సీజన్.
ఈ అయిదు సీజన్ లకు కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ మధ్య కాలంలో కాస్త రేటింగ్ తగ్గినా కూడా తెలుగు లో వస్తున్న రేటింగ్ పట్ల సంతృప్తిగానే ఉన్నారట.
సీజన్ 6 కే నాగార్జున హోస్ట్ గా చేసేందుకు ఆసక్తి చూపించలేదట. కానీ నిర్వాహకులు అప్పటికప్పుడు కొత్త హోస్ట్ ను తీసుకు రావడం కష్టంగా భావించి నాగార్జునను కొనసాగేందుకు ఒప్పించారట. ఈ ఒక్క సీజన్ కు నాగార్జున ఓకే చెప్పాడని.. సీజన్ 7 కి కచ్చితంగా తాను చేయలేను అన్నట్లుగా నిర్వాహకులకు కండీషన్ పెట్టాడట.
అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పుడు కొత్త హోస్ట్ కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదే సమయంలో బిగ్ బాస్ యొక్క కొత్త హోస్ట్ ను గ్రాండ్ ఫినాలే లో ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 కి కొత్త హోస్ట్ రావడం అనేది పక్కా అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.