Begin typing your search above and press return to search.

హేమను ప్రెగ్నంట్ టెస్ట్.. శ్రీరెడ్డివి ఒరిజనల్ వేనా అని అడగటమా?

By:  Tupaki Desk   |   2 Aug 2019 10:23 AM GMT
హేమను ప్రెగ్నంట్ టెస్ట్.. శ్రీరెడ్డివి ఒరిజనల్ వేనా అని అడగటమా?
X
బిగ్ బాస్ సీజన్ 3 మీద వివాదం అంతకంతకూ ముదురుతోంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు హౌస్ లోకి పంపేందుకు ఎంపిక చేసి.. తర్వాత రిజెక్ట్ చేసిన వైనంపైన శ్వేతారెడ్డి తదితరులు ఇప్పటికే మీడియా ముందుకు రావటం.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం తెలిసిందే. మరోవైపు.. మహిళల్ని కించపరిచేలా ఉన్న ఈ షోను నిషేధించాలంటూ ఓయూ విద్యార్థి జేఏసీ హెచ్చరికలు చేయటం తెలిసిందే.

ఓవైపు బిగ్ బాస్ షోకు ఆదరణ అంతకంతకూ పెరగటం.. గడిచిన రెండు సీజన్లతో పోలిస్తే.. మూడో సీజన్ కు టీఆర్పీ రేటింగ్ బాగుండటం ఆసక్తికరంగా మారింది. నాగ్ యాంకరింగ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందన్న మాట ఇండస్ట్రీలో వినిపిస్తున్న వేళ.. మరోసారి ఈ షో మీద కొత్త వివాదాలు వస్తున్నాయి.

తొలి వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన నటి హేమ ప్రెస్ మీట్ పెట్టటం.. బిగ్ బాస్ షో మీదా.. హౌస్ మేట్స్ మీదా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తనను ఎంపిక చేసిన సమయంలో ప్రెగ్నెంట్ టెస్ట్ చేయించుకోవాలని కోరారని వెల్లడించిన హేమ వ్యాఖ్యల్ని శ్వేతారెడ్డితో పాటు.. ఓయూ విద్యార్థి జేఏసీ ఇప్పుడు ప్రశ్నిస్తుంది. వాస్తవానికి హేమ మాట్లాడిన సందర్భంలో తనను ప్రెగ్నంట్ టెస్ట్ రిపోర్ట్ అడగటం వెనుకున్న కారణాన్ని పాజిటివ్ గానే చెప్పారు. ఇక.. శ్రీరెడ్డి బ్రెస్ట్ ఒరిజినల్ వేనా అని అడిగారని.. ఇలా ఎలా అడుగుతారంటూ వారు మండిపడుతున్నారు. మహిళల్ని కించపరిచేలా బిగ్ బాస్ తీరును వారు తప్పు పడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ ను ముట్టడిస్తామని.. మన్మధుడు2 చిత్రాన్ని అడ్డుకుంటామన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుందా? అన్న భావన కలిగేలా చేస్తున్నారని చెప్పక తప్పదు.