Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ‘కొత్త’లోకం.. హీరోల సృజనాత్మకథ

By:  Tupaki Desk   |   4 May 2019 1:30 AM GMT
టాలీవుడ్ లో ‘కొత్త’లోకం.. హీరోల సృజనాత్మకథ
X
టాలీవుడ్ అందరికీ అన్ని ఇచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకున్నవారు అందలమెక్కారు. వినియోగించుకోలేని వారు అధ:పాతాళానికి పడిపోయారు. టాలీవుడ్ కల్పతరువుగా ఎదిగిన ఎంతో మంది సినీ ప్రముఖులు ఎందరో.. వారంతా మూసధోరణితో అంత ఎత్తుకు ఎదగలేదు. వారిలోని సృజనాత్మకథ.. కొత్తగా ట్రై చేయడం.. కాలానుగుణంగా మారడంతోనే వారు విజయాలను సొంతం చేసుకున్నారు.

టాలీవుడ్ లో వెలుగు వెలిగిన ఎంతో మంది నవతరం హీరోలు ఆ తర్వాత కనమరుగయ్యారు. సరైన కథా, కథనాలను ఎంచుకోకపోవడం.. మూసధోరణితో సినిమాలు తీయడంతో వారంతా ఒకప్పటి హీరోలుగానే మిగిలిపోయారు. కొత్తగా ఆలోచించి సినిమాలు తీసిన వారే కలకలం టాలీవుడ్ ను ఏలే హీరోలుగా మారారు.

చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేశ్ నాలుగు దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ లుగా ఎదిగారంటే దానివెనుక ఎంతో కృషి, పట్టుదల ఉంది. వారి టాలెంట్ తోపాటు ఎప్పుడూ సరికొత్తగా ఆలోచించి నవతరం దర్శకులు, కొత్త కథలతో సినిమాలు తీయడమే వారి విజయానికి కారణమైంది.

కొత్త ఒక వింత అంటారు.. కానీ కొత్తదనం లేకపోతే సినిమా ఇండస్ట్రీలో మనుగడ సాధించడం కష్టం. అందుకే కుర్ర హీరోలు, కొత్త దర్శకుల కాలం ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తోంది. కొత్త కథలతో ప్రయోగాలు చేస్తున్న హీరోలే ఇండస్ట్రీపై చెరగని ముద్రవేస్తున్నారు..

టాలీవుడ్ లో కుర్రహీరోలు సృజనాత్మ‘కథ’తో అద్భుతాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, నిఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్, ఆది, కార్తికేయ, శ్రీవిష్ణు, సుధాకర్ కోమాకుల తదితర ఎంతో మంది కుర్ర హీరోలు క్రియేటివిటీతో దూసుకువస్తున్నారు. నవతరం దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. అద్భుతమైన కథలను అక్కున చేర్చుకొని తీస్తూ విజయాలు అందుకుంటున్నారు. కొత్త కొత్త పాయింట్లను తెరమీదకు తీసుకొస్తున్నారు. ఒకప్పుడు తమిళనాట మొదలైన ఈ ఒరవడి ఇప్పుడు తెలుగులో కూడా పాకింది. అందుకే సరికొత్త కథలు.. కుర్ర హీరోల ప్రయోగాలతో టాలీవుడ్ ఇప్పుడు హిట్స్ తో కళకళలాడుతోంది.