Begin typing your search above and press return to search.
ఓ వైపు గన్ తో ప్రేయసి, మరోవైపు బేడీలతో విలన్!
By: Tupaki Desk | 11 May 2023 11:00 AM GMTయువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, గార్జియస్ బ్యూటీ కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించి తాజా చిత్రం కస్టడీ. కోలీవుడ్ విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగు తమిళ భాషల్లో ఈ బైలింగువల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ల కు కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది.
పోలీస్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన కస్టడీపై నాగ చైతన్యతో పాటు మేకర్స్ కూడా భఆరీ అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ప్రియమణి, అరవింద్ స్వామి లాంటి ప్రముఖ నటీనటులు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ సినిమా కు స్వరాలు చేకూర్చారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది.
అందులో నాగ చైతన్య.. బేడీలు వేసి అరవింద్ స్వామిని పట్టుకొని వస్తుండగా.. పక్కనే కృతి శెట్టి గన్ పట్టుకొని కనిపిస్తోంది. కుర్తీలో ఉన్న ఆమె మరకలతో ఉన్న బట్టల్లో కనిపిస్తోంది. మరోవైపు ఫుల్లు చెమటలు, గాయాలు, చినిగిన బట్టల్లో నాగ చైతన్య చాలా అలిసిపోయినట్లుగా కనిపిస్తున్నారు. అరవింద్ స్వామి కూడా ఆయాస పడుతుండగా.. నాగ చైతన్య అతడిని తీసుకొని వస్తున్నట్లుగా అర్థం అవుతోంది.
తెలుగులో ఇప్పటి వరకూ రాని విలన్ ను కాపాడే హీరో అనే పాయింట్ ను కస్టడీలో హైలెట్ చేశారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ గా కనిపించనుండగా... అతడిని కాపాడే పోలీసుగా, ఓవైపు ఇష్టం లేని పెళ్లి చేసుకోబోతున్న ప్రేయసితో సహా బయటకు వచ్చిన అతను వాళ్లిద్దరినీ ఎలా కాపాడన్నదే సినిమా. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ చూస్తుంటే ఈ విషయం బాగా అర్థం అవుతోంది.
మే 12వ తేదీ అంటే రేపే విడుదల కాబోతున్న ఈ చిత్రంలో శరత్ కుమార్, సూర్య, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు అమ్మాయి ఆనంది కూడా ఓ కీలక పాత్రలో నటించారట. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.