Begin typing your search above and press return to search.
కొత్త డైరెక్టర్లు అందరికీ అతడే ఛాయిస్
By: Tupaki Desk | 2 Nov 2017 4:34 AM GMTయంగ్ హీరో నాగశౌర్య ఈ ఏడాది మొత్తం మీద నారా రోహిత్ హీరోగా నటించిన కథలో రాజకుమారి సినిమాలో మాత్రమే కనిపించాడు. అందులోనూ అతడిది కామియో రోల్ మాత్రమే. యంగ్ హీరో కెరీర్ లో ఏడాది రిలీజ్ అనేది లేకపోవడం లోటే అయినా వచ్చే ఏడాది మాత్రం నాగశౌర్యకు ప్రత్యేకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం నాగశౌర్య తమిళ్ డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో కెరీర్ లో తొలిసారి ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. కణం పేరుతో తెలుగులో.. కరు పేరుతో తమిళంలో తెరకెక్కుతున్నఈ మూవీలో ఫిదాం ఫేం సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా కృష్ణవంశీ టీంలో పనిచేసిన శ్రీనివాస్ అనే దర్శకుడితో నర్తనశాల సినిమా చేయడానికి నాగశౌర్య పచ్చజెండా ఊపాడు. దీంతోపాటు సుందర్ డైరెక్షన్ లో అమ్మమ్మగారిల్లుతోపాటు సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ దర్శకత్వంలోనూ ఓ మూవీలో నటిస్తున్నాడు.
నాగశౌర్య ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాల్లో కణం మినహా మిగతా వాటన్నింటికీ దర్శకుడు కొత్తవాళ్లే. డైరెక్టర్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి సిద్ధపడుతున్న వారంతా ముందు నాగశౌర్యను మెప్పించి మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. ఆసక్తికరమైన పాయింట్.. స్క్రిప్ట్ తో ముందుకు రావడంతోనే కొత్తవాళ్లతో వరసగా సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడనేది నాగశౌర్య సన్నిహితుల మాట.