Begin typing your search above and press return to search.
చెర్రీ బిజీ బిజీ.. కొణిదెల ప్రొడక్షన్స్ డీన్ ఎవరు?
By: Tupaki Desk | 10 April 2022 8:30 AM GMTసరైన టైమింగుతో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ రేస్ లో దూసుకెళుతున్నాడు రామ్ చరణ్. ఇంతకుముందు హీరోగా నటిస్తూనే సినీనిర్మాణంలో అడుగుపెట్టాడు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో వరుసగా సినిమాల్ని నిర్మించేందుకు కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ ని స్థాపించారు. నాన్న గారికి అదిరిపోయే గిఫ్ట్ ఇస్తానంటూ ఖైదీ నంబర్ 150 - సైరా నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రాల్ని నిర్మించారు. విజయాల్ని అందించారు. ఇటీవల ఆచార్య చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మించింది.
అయితే వరుసగా భారీ చిత్రాల్ని నిర్మించడం మరోవైపు నటుడిగా అసాధారణ స్టార్ డమ్ తో ముందుకు వెళ్లడం రెండు పడవల పయనం అనడంలో సందేహం లేదు. కారణం ఏదైనా కానీ రామ్ చరణ్ కి సినీనిర్మాణం కొంత బోరింగ్ అనిపించిందని గుసగుస వినిపిస్తోంది. `ఆచార్య`నే నిర్మాతగా అతడికి చివరి మూవీ అట.
సన్నిహితుల సమాచారం మేరకు.. చరణ్ ఇక నిర్మాణం నుంచి తప్పుకుని పూర్తిగా నటనపైనే దృష్టి సారిస్తున్నారట. అయితే చరణ్ స్థానంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బాధ్యతల్ని నిర్వహించేది ఎవరు? అంటే.. ఆ బాధ్యతల్ని సుస్మిత కొణిదెల స్వీకరిస్తున్నారని గుసగుస వినిపిస్తోంది. సుస్మిత ఇప్పటికే కాస్ట్యూమ్స్ రంగంలో రాణించారు.
తండ్రి సినిమాలకు నిర్మాతగా చరణ్ తో కలిసి బాధ్యతల్ని పంచుకున్నారు. అలాగే సొంత బ్యానర్ లో వెబ్ సిరీస్ ని నిర్మించిన అనుభవం కూడా తనకు ఉంది. ఓవరాల్ గా చరణ్ కి తన సోదరి అందుబాటులోకి వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ బాధ్యతల్ని స్వీకరించేందుకు ఇంతకుమించి అర్హత అవసరం లేదు. హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ బాధ్యతను తాను స్వీకరిస్తుందని టాక్ వినిపిస్తోంది.
బాధ్యతల్ని తన సోదరికి బదలాయించాక చరణ్ పూర్తిగా పాన్ ఇండియా స్టార్ డమ్ పైనే దృష్టి సారిస్తారు. ఇటీవల భారీ పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ బంపర్ హిట్ కొట్టడం పైగా ఆ మూవీ క్రెడిట్స్ అన్నీ తనకే కలిసి రావడం కూడా చరణ్ కి పెద్ద బూస్ట్ నిచ్చింది. అతడు తదుపరి దేశం గర్వించదగ్గ దర్శకదిగ్గజం రోబో శంకర్ తో పని చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. దీంతో చరణ్ రేంజ్ కూడా అమాంతం మారిపోనుంది. ఆ తర్వాతా బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి పని చేసేందుకు ముంబైలో ప్రత్యేకించి సొంత అపార్ట్ మెంట్లను.. ఆఫీస్ స్పేస్ ను కొనుక్కున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే బాలీవుడ్ బాద్షాలకు గట్టి పోటీనిస్తున్నారు తెలుగు హీరోలు. ఇదే క్రమంలో బాలీవుడ్ లో బంతాడేందుకు చరణ్ కూడా సిద్ధమయ్యాడని గుసగస ఇప్పటికే వినిపిస్తోంది. నటన - డ్యాన్సుల పరంగా బాలీవుడ్ హీరోల్ని బీట్ చేసే సత్తా తెలుగు హీరోలకు ఉంది. అందులో చరణ్ రేంజు వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. చెర్రీ ప్లానింగ్ ఏంటో ఇప్పుడు అభిమానులు గ్రహించారనే భావించాలి.