Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. బ్లాక్ బస్టర్ సీక్వెల్లో..!
By: Tupaki Desk | 15 March 2021 4:30 AM GMTటాలీవుడ్ లో అగ్ర కుటుంబాల నుంచి కథానాయకులు పరిచయం అవ్వడం రెగ్యులర్ గా చూస్తున్నదే. మెగాఫ్యామిలీ - నందమూరి ఫ్యామిలీ- అక్కినేని ఫ్యామిలీ- మంచు ఫ్యామిలీ .. ఇలా కుటుంబ హీరోలు రాజ్యమేలుతున్నారు.
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది హీరోగా పరిచయం అవుతుండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అతడి పేరు నార్నే నితిన్ చంద్ర. తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతికి తమ్ముడు. ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకుని నార్నే నితిన్ చంద్ర పక్కాగా ప్రిపేరయ్యాడని తెలుస్తోంది. డ్యాన్సులు.. ఫైట్స్ లోనూ శిక్షణ తీసుకున్నారని తెలిసింది.
ఉదయ్ కిరణ్ .. నితిన్ లాంటి హీరోల్ని వెండితెర కథానాయకులుగా పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ తేజ తారక్ బావమరిది నార్నే నితిన్ ని పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇక నార్నే ఎస్టేట్ గురించి నార్నే శ్రీనివాసరావు గురించి పరిచయం అవసరం లేదు. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు! అంటే పరిశ్రమతో పాటు అందరి అటెన్షన్ అటువైపు ఉంటుందనడంలో సందేహం లేదు.
ఇక బావమరిది కెరీర్ ని తీర్చిదిద్దేందుకు తారక్ ఎంతగా సాయపడనున్నారు? అన్నదానిపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. కథల ఎంపిక నుంచి ప్రతిదీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి చిత్రం 1.1 అనే టైటిల్ ఫిక్స్ చేసిన తేజ ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించనున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఆడిషన్స్ లో హీరోని ఎంపిక చేసి 40 మంది ఆర్టిస్టుల్ని కొత్తవారిని ఫైనల్ చేశారన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.