Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: దూసుకొస్తున్న కొత్తందాలు

By:  Tupaki Desk   |   4 Jun 2019 5:30 PM GMT
టాప్ స్టోరి: దూసుకొస్తున్న కొత్తందాలు
X
తెలుగులో తెలుగ‌మ్మాయిల‌కు అవ‌కాశాలు రావు! అన్న అప‌ప్ర‌ద తొల‌గిపోతోంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లోకి తెలుగ‌మ్మాయిలు వెల్లువ‌లా దూసుకొస్తున్నారు. మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌ల‌తో పాటు ముంబై భామ‌లు.. చెన్న‌య్ చంద్రాలు.. బెంగ‌ళూరు- మంగుళూరు అంద‌గ‌త్తెలు వెల్లువెత్తుతున్నా ఇటీవ‌ల సీను మారుతోంది. ప్ర‌స్తుతం తెలుగులో తెలుగ‌మ్మాయిలు ఎవ‌రెవ‌రు ఉన్నారు? అని వెతికితే ..

ట్యాక్సీవాలా సినిమాతో స‌ర్రున దూసుకొచ్చింది అనంత‌పురం అమ్మాయి ప్రియాంక జవాల్క‌ర్. ఆరంభ‌మే విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి స్టార్ స‌ర‌స‌న న‌టించి మంచి మార్కులే కొట్టేసింది. ట్యాక్సీవాలా బంప‌ర్ హిట్ కొట్టాక ప్రియాంక కు ప‌లు ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి. బీటెక్ చేసి సినీఛాన్సులు అందుకున్న ప్రియాంక తొలి హిట్ అందుకున్నాక ర‌వితేజ లాంటి స్టార్ స‌ర‌స‌న అవ‌కాశం వ‌చ్చింద‌ని వార్త‌లొచ్చాయి. అలాగే రంగ‌స్థ‌లం చిత్రంలో ఆదికి పెయిర్ గా న‌టించిన పూజిత పొన్నాడ కెరీర్ ప‌రంగా నాలుగైదు సినిమాల‌కు సంత‌కాలు చేసి బిజీ అయిపోయింది. పూజిత న‌టించిన తాజా చిత్రం సెవెన్ ఈనెల 5న రిలీజ‌వుతోంది. అలాగే జీవిత - రాజ‌శేఖ‌ర్ జంట న‌ట‌వార‌సురాళ్లు శివానీ - శివాత్మిక సిస్ట‌ర్స్ టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. శివానీ తొలి సినిమా కొన్ని అవాంత‌రాల వ‌ల్ల వాయిదా ప‌డినా .. మునుముందు త‌న కెరియ‌ర్ ని బెస్ట్ గా తీర్చిదిద్దేందుక జీవిత రాజ‌శేఖ‌ర్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. అలాగే శివానీ కంటే ముందే త‌న సోద‌రి శివాత్మిక న‌టించిన దొర‌సాని చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంతో దేవ‌ర‌కొండ బ్ర‌ద‌ర్ ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు.

మ‌రోవైపు మ‌ల‌యాళీ నుంచి ఓ ఇద్ద‌రు అంద‌గ‌త్తెలు తెలుగు తెర‌పై బిజీ అవుతున్నారు. ఓవైపు కోలీవుడ్ లో అర‌డ‌జ‌ను సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్న ఐశ్వర్యా రాజేష్ న‌టించిన రెండు సినిమాలు త్వ‌ర‌లో తెలుగులో రిలీజ‌వుతున్నాయి. `కౌసల్య కృష్ణమూర్తి: క్రికెటర్‌` భీమ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. అలాగే దేవ‌ర‌కొండ స‌ర‌స‌న క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తోంది. ప్ర‌ముఖ మ‌ల‌యాళీ పిలింమేక‌ర్ మోహ‌నన్ కుమార్తె మాళవిక మోహనన్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. దేవ‌ర‌కొండ స‌ర‌స‌న `హీరో` అనే స్ట్రెయిట్ చిత్రంతో టాలీవుడ్ లో ప్ర‌వేశిస్తోంది. ఈ చిత్రానికి ఆనంద్‌ అన్నామలై దర్శకత్వం వ‌హిస్తున్నారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో చిత్ర‌మిది. మాళ‌విక ఇదివ‌ర‌కూ ర‌జ‌నీకాంత్ పేట (పెట్టా)లో న‌టించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్ర‌ద్దా క‌పూర్ `సాహో` చిత్రంతో తెలుగులో అడుగుపెడుతోంది. ప్ర‌భాస్ లాంటి అగ్ర హీరో స‌ర‌స‌న ఆరంభ‌మే అవ‌కాశం అందుకున్న క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతోంది. సాయిధ‌ర‌మ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తున్న తొలి చిత్రం ఉప్పెన తో కృతి శెట్టి అనే ముద్దుగుమ్మ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతోంది. శాండ‌ల్ వుడ్ లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించిన కృతి కి సుకుమార్ లాంటి బెస్ట్ డైరెక్ట‌ర్ కాంప్లిమెంట్లు ఇవ్వ‌డాన్ని బ‌ట్టి త‌న‌కు పెద్ద రేంజు ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. వీళ్లే కాదు. ఇంకా ప‌లువురు భామ‌లు టాలీవుడ్ లో ల‌క్ చెక్ చేసుకునేందుకు బ‌రిలో దిగుతున్నారు.