Begin typing your search above and press return to search.

డీజే రాధిక టైమ్ షురూ.. రచ్చ ఖాయం

By:  Tupaki Desk   |   16 Feb 2022 6:31 AM GMT
డీజే రాధిక టైమ్ షురూ.. రచ్చ ఖాయం
X
మెహబూబా.. గల్లీ రౌడీ సినిమాల్లో నటించిన నేహా శెట్టి ఆ సినిమాలు కమర్షియల్ విజయాలను దక్కించుకోలేక పోవడంతో గుర్తింపు దక్కించుకోలేక పోయింది. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా స్కిన్ షో చేసే ఈ అమ్మడు నటన పరంగా కూడా టాప్ హీరోయిన్ మెటీరియల్‌ అనడంలో సందేహం లేదు. కెరీర్‌ ఆరంభంలో అదృష్టం కలిసి రాకపోవడంతో ప్లాప్ లు పడ్డాయి. కాని ఇప్పుడు ఆమె టైమ్‌ నడుస్తుంది.

డీజే టిల్లు సినిమాలో సిద్దుకు జోడీగా రాధిక పాత్రలో నటించి యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. సినిమా ప్రమోషన్‌ సమయంలో హడావుడి చేయడం ద్వారా.. జర్నలిస్ట్‌ అడిగిన ఒక వివాదాస్పద ప్రశ్న కారణంగా మీడియాలో నిలిచింది. దాంతో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఈ సమయంలో నేహా శెట్టి వరుసగా ఆఫర్లు దక్కించుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇటీవలే విడుదల అయిన డీజే టిల్లు సినిమా కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా సినిమాలో రాధిక పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. అందుకే డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టికి టాలీవుడ్‌ లో గుడ్‌ టైమ్‌ స్టార్ట్ అయ్యింది అంటూ టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటి వరకు చిన్న హీరోలు కూడా పెద్దగా పట్టించుకోని నేహా శెట్టిని ఇప్పుడు పెద్ద హీరోలు కన్సిడర్‌ చేసే స్థాయికి చేరిందట.

ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాది వరకు అయినా నేహా శెట్టి స్టార్‌ హీరో సినిమాలో కనిపించడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ఆఫర్లను ఆచి తూచి ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేయాలంటూ ఈ అమ్మడికి సలహాలు ఇస్తున్నారు. మరో రాధిక తరహా పాత్ర పడి డీజే టిల్లు లాంటి కమర్షియల్‌ సక్సెస్ పడితే నేహా శెట్టిని ఏ ఒక్కరు ఆపలేరు అనడంలో సందేహం లేదు.

ఇలాంటి సమయంలో మంచి కథ మరియు పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తే బాగుంటుంది. అలాగే స్టార్‌ హీరో లేదా దర్శకుడి నుండి ఆఫర్‌ వచ్చిన సమయంలో కళ్లు మూసుకుని ఒప్పేసుకోవాలని కూడా కొందరు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డీజే టిల్లు ద్వారా అనూహ్యంగా స్టార్‌ డమ్‌ దక్కిన ఈ అమ్మడు తన ఆ స్టార్‌ డమ్‌ ను ఎంత మేరకు నిలుపుకుని.. రాధిక ఇమేజ్ ను ఉపయోగించుకుంటుంది అనేది చూడాలి.

డీజే టిల్లు సినిమా వసూళ్ల విషయానికి వస్తే మొదటి రోజే నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ ను సాధించినట్లుగా వార్తలు వచ్చాయి. రెండవ మరియు మూడవ రోజుకు విడుదల అయిన అన్ని చోట్ల కూడా బ్రేక్‌ ఈవెన్‌ వసూళ్లు దక్కించుకుంది. యూఎస్ లో ఈ ఏడాదిలో విడుదల అయిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమా గా డీజే టిల్లు నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా డీజే వాయింపు మరో రేంజ్ లో ఉంది. అందుకే ఈ సినిమాతో నేహా శెట్టికి మంచి ఆఫర్లు వస్తున్నాయి.